రాష్ట్ర ముఖ్యమంత్రి గా నాల్గవసారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని చిరుధాన్యాలను ఉపయోగించి విశాఖ కు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ తయారు చేశారు. గత ఐదు రోజులుగా ఆయన ఎంతో శ్రమించి కేవలం సహజసిద్ధమైన మిల్లెట్స్ ను ఉపయోగించి ఈ చిత్రపటాన్ని తయారు చేయడం విశేషం. గత ఏడాదికాలంగా విజయకుమార్ మిల్లెట్స్ ఉపయోగించి వందలాది ప్రముఖుల చిత్రపటాలను తయారు చేస్తున్నారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వివిధ దేశాల ప్రధానులు, పారిశ్రామికవేత్తలు, మంత్రుల చిత్రపటాలను ఆయన ఎంతో శ్రమించి తీర్చిదిద్దుతున్నారు. మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు చాటే విధంగా తన కళకు ఒక సామాజిక సందేశాన్ని జోడిస్తూ ఆయన వీటిని తయారు చేస్తున్నారు. విశాఖ, హైదరాబాద్, న్యూఢిల్లీలో జరిగిన G20 సదస్సులలో సైతం విజయ్ కుమార్ తయారుచేసిన మిల్లెట్స్ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 45 దేశాలకు చెందిన విదేశీ వ్యవసాయ శాఖ మంత్రులకు మిల్లెట్స్ తో వారి చిత్రపటాలని తయారుచేసి విజయకుమార్ బహూకరించారు. అవకాశం వస్తే ఈ చిత్రపటాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి తాను బహుకరిస్తానని తెలిపారు.
next post