ఆంద్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే చానల్స్ వార్ మొదలయిపోయింది.. వైసీపీ అనుకూల ఛానళ్ళుగా పేరుపొందిన సాక్షి టీవీ, ఎన్ టీవీ, టీవీ9, 10టీవీ ల ప్రసారాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేస్తున్నారని కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం తీసుకుని నిలిపివేసినట్లు వార్త బయటకొచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాలు, వాలంటీర్లు ఇలా అందరూ సాక్షి చదవాలి అని గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టేయడంతో ఒకే రోజు 12 లక్షల సాక్షి పేపర్ సర్కులేషన్ పడిపోయాయని బాగానే ప్రచారం జరిగింది. ఏపీ ఫైబర్ లో కూడా టీవీ5, ఏబీఎన్, ప్రసారాలు పునరుద్ధరింపబడి, వైసీపీ అనుకూల చానల్స్ లో కొన్ని నిలిచిపోయాయి.. దీంతో ఏపీ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ బ్లాక్ చేసిన న్యూస్ చానల్స్ విషయంలో జోక్యం చేసుకోవాలని… ట్రాయ్ చైర్మన్ కు వైసీపీ రాజ్యసభ సభ్యుడు, సినీ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి లేఖ రాయడం తో చానల్స్ నిలుపుదల విషయం మళ్లీ వార్తల్లోకొచ్చింది.ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (వార్త రాసే సమయానికి ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగలేదు కనుక) టైం దొరికినప్పుడల్లా టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ, చానల్స్ పై విరుచుకు పడుతూనే వుండేవారు.. అలా సభలకి మాత్రమే ఆ వ్యాఖ్యలు పరిమితమయితే గోడవుండేదే కాదు.. రాష్ట్రంలో తెలుగుదేశం అనుకూల చానల్స్ ని ఎమ్మెస్వో లు ట్రాన్స్మిషన్ చెయ్యకూడదని అనధికార ఉత్తర్వులు రావడం తో కేబుల్ ఆపరేటర్లు ఆయా చానల్స్ ప్రసారాన్ని నిలిపివేశారు.. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయం నుంచి ప్రారంభమైన ఈ చానల్స్ వార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రం గా మళ్లీ రెక్కలు విప్పుకుంది.. 2014 ఎన్నికల్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తుందన్న నెపంతో సాక్షి టీవీ ప్రసారాలను బంద్ చేసిన ఆపరేటర్లు 2019 లో అధికార మార్పు జరిగిన తరువాత టీడీపీ అనుకూల చానల్స్ ప్రసారాలని నిలిపివేశారు.. అలాగే సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు సాక్షి పేపర్ ని తప్పనిసరి గా వేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.. అయితే 2015 నాటికే కేబుల్ ఆపరేటర్ల హవా తగ్గి డిష్ ఆపరేటర్లు ప్రాబల్యం పెరగడం తో చానల్స్ యాడ్ రెవిన్యూకి టీఆర్పీ కి పెద్ద ఇబ్బంది రాలేదు.. యూ ట్యూబ్ లో కూడా లైవ్ న్యూస్ రావడంతో ఎవ్వరు ఏ రకంగా ఇబ్బంది పడలేదనే చెప్పాలి.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తో చానల్స్ లొల్లి మొదలైంది.. అయితే గతం లో లేని కంప్లైంట్స్ అంశం మొదలవడం తో ట్రాయ్ ఎం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.
previous post
next post