ఎయిర్ పోర్ట్ లోపులి కలకలం.. ఇంటిలోకి వచ్చిన కొండచిలువలు.. రొడ్లపైకొచ్చిన మొసళ్ళు.. అరణ్యాలలో వుండాల్సిన వన్య ప్రాణులు ఇలా జనావాసాలలోకి వస్తున్న సంఘటనలు ఇటీవల తరచూ వింటున్నాం.. అధికారులు అష్ట కష్టాలు పడి రెస్క్యూ చేసి తిరిగి అడవుల్లోకి పంపుతున్నారు.. అవి అసలు అడవుల్లో నుంచి బయట కు ఎందుకు వస్తున్నాయి.. నిజానికి అవి బయట కి రావడం లేదు గతంలో ఆ జంతువుల స్వస్థానం లో బిల్డింగ్స్ కట్టారు.. రోడ్లు వేశారు అన్న నిజం తెలియక మాత్రమే వస్తున్నాయి.. ఇవి వన్య ప్రాణుల స్థితి నీ చెప్పడానికి మాత్రమే ఇప్పుడు ఆ ప్రాణులన్నీ మన దగ్గరకి రావడం లేదు మనమే వాటి అరణ్యాలను కాంక్రీట్ జంగిల్ గా చేస్తున్నాం.. ఈ ఆర్గనైజ్డ్ క్రైం కి మనిషొక్కడే కారణం.. ఆ మనిషి లో అపుడప్పుడు మానవత్వం పరిమళించే స్థితి వస్తుంది.. అడవులన్నీ కబ్జా పాలయ్యాయి.. పొలాలు కమర్షియల్ పంటలతో వర్థిల్లుతున్నాయి.. ఆవులు, గేదెలు పెంచేవాళ్ళు పాలు ఆశిస్తారు కానీ వాటి కడుపుకి తగ్గ మేత పెడుతున్నామా లేదా…? అని మాత్రం ఆలోచించారు.. తనకు కావల్సిన గడ్డిని వెతుక్కుంటూ ఆంధ్రా యూనివర్సిటీ కి ఒక గుంతలో పడి ప్రాణాపాయ స్థితిలో విలవిలలాడిన ఒక సూడి గేదే (కడుపుతో వున్న )ను నిత్యం వార్తల సేకరణ తో బిజీగా వుండే జర్నలిస్టు ల సాయం తో చికిత్స అందించి రక్షించారు.
జియాలజీ డిపార్ట్మెంట్ పక్కన గల ఐదు అడుగుల ఇంకుడు గొయ్యలో పడిపోయిన ఒక గేదె ను హాస్టల్ విద్యార్థులు ఎంతో శ్రమకోర్చి బయటకు తీశారు. అయితే సరైన చికిత్స, సంరక్షణ లేకపోవడంతో అలానే పడిపోయి ఉంది. ఇదే విషయాన్ని జర్నలిస్టుల గ్రూప్ లో అడ్మిన్ ఎమ్మెస్సార్ ప్రసాద్ పోస్ట్ చెయ్యడం తో అందులో వున్న అధికారులు, తోటి జర్నలిస్టుల ఆఘమేఘాల మీద స్పందించి ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, స్టాఫ్, విశాఖ జీవీఎంసీ వెటర్నరీ వైద్య సిబ్బంది, పినగాడి గోమాత సంరక్షణ కేంద్ర యజమానురాలు సహాయ సహకారాలతో అస్వస్థతకు గురైన గోమాతను రక్షించారు.. ఎప్పుడు సమస్యలను ఎత్తి చూపి పరిష్కారానికి ప్రయత్నించే పాత్రికేయులు చూపించిన చొరవే ఆ ప్రాణాన్ని నిలిపింది.. వారు చూపించిన శ్రద్ద పై అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తూ అభినందిస్తున్నారు.. ఒక మంచి పని చేసినప్పుడు ఇచ్చిన ఆనందం కోట్లు ఇచ్చినా రాదనే సంతోషం ఇప్పుడు వాళ్ళ మొహాలపై స్పష్టం గా కనిపిస్తోంది. అన్ని గ్రూప్ ల్లా కాకుండా జీరో ఎంటర్టైన్మెంట్ తో సమాచారం, సామాజికం అన్న కోణాలలోనుంచే నడుస్తున్న ఈ ‘నగరం లో నేడు ‘ గ్రూప్ తోటి పాత్రికేయులు హెల్త్ ఇష్యు తో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఇలాగే స్పందించి సాయమందించారు.. అలాగే బెగ్గింగ్ మాఫియా పై ఫోటోలు పెట్టి అందరినీ మెల్కోలిపిన అంశాలు కూడా వున్నాయి. అందుకే వారికి జేజేలు.