ఇది షారుఖ్ ఖాన్ రెగ్యులర్ మూవీ కాదు. ఇదివరకు వచ్చినటువంటి కథ అసలే కాదు. గత సినిమాలకు భిన్నంగా వచ్చిన మూవీ జవాన్.అయితే చూసే వాళ్ళకి ఇది రెగ్యులర్ మూవీ లాగా అనిపిస్తే అనిపించొచ్చు కానీ షారుక్ ఖాన్ చేయడమే ఇప్పుడు టాక్ ఆఫ్ ఇండస్ట్రీ గా మారింది. ఈ సినిమాలో అంత విషయం ఉందా అంటే.. ఉందనే ఖచ్చితంగా చెప్పాలి. ప్రభుత్వ వ్యవస్థలు పని తీరును,రాజకీయ నేతల వ్యవహార శైలిని, బడా వ్యాపారవేత్తల ధన దాహాన్ని ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు.ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సినిమాలో కొన్ని కొన్ని సీన్లు , డైలాగులు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతుంది. కథను చాలా క్లారిటీగా రాసుకున్న అట్లీ సినిమాలో ప్రధానంగా రైతుల కోసం, వైద్య వ్యవస్థ కోసం చర్చించారు. అలాగే ఆర్మీకి సరఫరా చేసే ఆయుధాలకు సంబంధించిన కాంట్రాక్టర్ల అవినీతిని కూడా ప్రశ్నించారు. వాస్తవంగా నాయకులు బయట చెప్పేది ఒకటైతే దానికి భిన్నంగా మరొకటి జరగడం కనిపిస్తూ ఉంటుంది. అదే ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు. ఈ సినిమాకి తమిళ్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ అయితే సినిమా ఖచ్చితంగా అట్టర్ ప్లాప్ అయ్యి ఉండేది. తమిళ్ డైరెక్టర్ కావడంతో కాస్త వాస్తవికతను కథలో చేర్చి సినిమా చివరి వరకు ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చో పెట్టే విధంగా చేశాడు. సినిమా హిందీతో పాటు తమిళ్ తెలుగులో కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 129 కోట్లు కలెక్షన్లు తెచ్చుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలలో కూడా జవాన్ కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాలో చూపించిన కొన్ని సన్నివేశాలు కానీ లేదా హీరోతో పలికించిన డైలాగులు కానీ కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చూసినట్టయితే సినిమా బ్యాన్ చేయాలని పెద్ద రచ్చ చేసి ఉండేవాళ్లు. అయితే ఈ సినిమా చాలావరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసిన సినిమా అని కొందరు ప్రచారం చేస్తున్నారు. అది ఒక బాలీవుడ్ టాప్ స్టార్ తీసిన సినిమా కావడంతో ఈ సినిమాలో మెసేజ్ జనాలలోకి త్వరగా వెళ్లే అవకాశం ఉంటుంది. మొదట్లో ఈ సినిమాను నిలుపుదల చేస్తారని పుకార్లు కూడా షికారులు చేశాయి. కానీ ఎట్టకేలకు సినిమా జనం ముందుకు వచ్చేసింది. వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కుమ్మేస్తుంది.
previous post
next post