ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి కి ఎన్నికల కమీషన్ గట్టి షాక్ ఇచ్చింది. జగన్ ని ఎలాగైనా గద్దె దింపి ఏపీ ని రక్షించుకోవాలని బీజేపీ సహిత తెలుగుదేశం జనసేన పార్టీ లు తీవ్ర ప్రయత్నం నేపథ్యంలో ఎన్నికల కమీషన్ రాష్ట్రంలో 14 అసెంబ్లీ నియోజవర్గాలలో జనసేన ఎన్నికల గుర్తు అయిన , గాజు గ్లాసు,ను ఇండిపెండెంట్లు, ఇతర చిన్నా,చితక పార్టీల అభ్యర్థులకు, తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థులకు ఆయా ప్రాంతాలలోని, రిటర్నింగ్ అధికారులు కేటాయించారు.జనసేన తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నచోట ఆ పార్టీ అభ్యర్థులకే గాజు గ్లాస్ గుర్తు కేటాయించగా ఈ పరిణామం కూటమి తరుపున పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపే వీలుందని భావిస్తున్నారు* జనసేన పోటీ చేయని ప్రాంతాల్లో గ్లాసు గ్లాసుని పోలిన గ్లాస్ టంబ్లర్ గుర్తు కేటాయించబడిన అభ్యర్ధులు…అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్న దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప్విజయనగరం మాజీ ఎమ్మెల్యే, స్వతంత్ర అభ్యర్ధగా నామినేషన్ వేసిన తెలుగుదేశం పార్టీ రెబల్ అభ్యర్థి మీసాల గీతమైలవరం లో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగ పవన్ కుమార్ విజయవాడ సెంట్రల్ లో ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థి గొల్లపల్లి ఫణిరాజ్ టెక్కలిలో స్వతంత్రం అభ్యర్థి అట్టాడ రాజేష్ కాకినాడ జిల్లా: జగ్గంపేట నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి పాఠంశెట్టి సూర్యచంద్రపెదకూరపాడు లో కుట్ర కోణం. :* ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కుమారుడు, స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ వేసిన నంబూరు కళ్యాణ్ బాబుగన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీమోహన కృష్ణమంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్ధి రావుసుబ్రహ్మణ్యంమదనపల్లె లో ఇండిపెండెంట్ గా బరిలో ఉన్న షాజహాన్విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి.. నవతరం పార్టీ అభ్యర్ధి కృష్ణ కిషోర్రాజమండ్రి పార్లమెంట్ కు పోటీ చేస్తున్న, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ అభ్యర్థి మేడా శ్రీనివాసరావు లకు రిటర్నింగ్ అధికారులు గ్లాసు ని పోలిన గుర్తు ను కేటాయించారు. గతం లో తెలంగాణ లో కారుని పోలిన రోడ్ రోలర్, రోటీ మేకర్ లాంటి ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తు కు వేల సంఖ్యలో ఓట్లు రావడం తో కూటమి పార్టీ లో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఈ గుర్తు లను మార్చాలని ఇప్పటికే జనసేన నాయకులు ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేశారు.