ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాకే భూముల మార్పిడి జీ వో 596 తెచ్చి ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అస్సైన్డ్ భూముల డీల్స్ సీ ఎస్ జవహార్ రెడ్డి చేశారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు.జీవో ఆధారంగా కుమారుడిని విశాఖలో పెట్టి 800 ఎకరాలకు పైగా భూముల డీల్స్ చేశారని వాటి రిజిస్ర్టేషన్ల కోసం నాలుగు రోజుల క్రితం విశాఖ వచ్చి భోగాపురం సమీక్ష అని చెప్పి సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు సమీక్ష జరిపారు*రోమ్ నగరం తగల పడి పోతుంటే ఫిడేల్ వాయించినట్టు..రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఒక పక్క ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారన్నారు…జగనన్న పేదల ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి విశాఖలోనే రెండు వేల కోట్ల భూములు కొట్టేస్తే మిగిలిన చోట్ల ఇంకెంతో అని ప్రశ్నించారు.. దేశంలో సివిల్ సర్వేంట్లు నిర్ఝాంతపోయేలా…రాజకీయ నేతలు షాక్ కు గురయ్యేలా… వేల కోట్ల భూ కుంభకోణానికి నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్. కె.ఎస్. జవహర్ రెడ్డి తెరలేపారని చెప్పారు.ఇఫ్పటికే ఉత్తరాంధ్రా జిల్లాలలో వెయ్యి కోట్ల రూపాయలకు పైగా విలువైన 400 ఎకరాల ఎస్ .సి, బి. సి ల అస్సైన్డ్ భూములను కుమారుడిని అడ్డంపెట్టి బినామీల పేరిట చేజిక్కిచుంకున్నారు*మరో 400 ఎకరాలకుపైగా భూములను ఆఘమేఘాల మీద రిజిస్ర్టేషన్ చేయించేందుకు యుద్ధప్రతిపదికన యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారనిఈ తరుణంలో జవహార్ రెడ్డి అవేవీ తనకు పట్టనట్టు విశాఖ వచ్చి అసైన్డ్ భూముల రిజిస్ర్టేషన్ల వ్యవహరాన్ని సమీక్షించి మరింత వేగంగా పనిపూర్తి అయ్యేలా తన అధికారంతో క్రింది స్ధాయి వారిపై వత్తిడి తీసుకు వచ్చారని సర్టిఫికేట్ జారీ అయితే భూములను 22ఎ నుంచి తప్పిస్తారుఈ మేరకు సెక్షన్ 35 ఆఫ్ 2023 పేరిట చట్టం చేశారనివీటన్నిటిపై సీబీఐ విచారణ జరపాలి.
next post