రాజస్థాన్ రాజధాని జైపూర్ లో భూకంపం సంభవించింది. సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున 09 నుండి 4:25 మధ్యలో వేర్వేరు సమయాల్లో మూడు సార్లు జైపూర్ తో సహా పలు ప్రాంతాలలో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాజధానిలో మొదటి ప్రకంపన 04:09:38కి రాగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది. రెండోది 04:22:57కి రాగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.1గా నమోదైంది. మూడవ సారి 04:25:33కి రాగా రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.4గా నమోదైంది. ఆరావళి కొండల్లో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. భూకంపం ధాటికి ప్రజలు ఇళ్ల నుంచి వీధుల్లోకి వచ్చారు. గాఢనిద్రలో ఉండగా భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. గత మార్చి 21 న, జనవరి 24 తేదీల్లో జైపూర్ తో పాటు రాజస్థాన్‌లోని ఇతర జిల్లాలలో భూకంపం ప్రకంపనలు సంభవించాయి. ఇటీవల సికార్ జిల్లాను భూకంపం వణికించింది.