ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కు మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ ను రాజేసింది.. శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయంలో ప్రోటోకాల్ పాటించలేదంటూమంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధం అని పేర్కొంటూ ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు గానే ఇలా వ్యవరించారని ఆ లేఖ లో ఆరోపించారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉందని ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదుపార్లమెంట్ లో కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాని ఈ నిబంధనను ఎవరూ పాటించలేదు అధికార కూటమి , స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు
చచ్చేదాకా కొట్టలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల రూపంలో బయటకు వచ్చాయి ఇటువంటి పరిస్థితులలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించట్లేదు ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలగం వినిపించే అవకాశం ఉంటుంది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నానంటూ విజ్ఞప్తి చేశారు.. గత ప్రభుత్వంలో టీడీపీకి ఇదే పదిశాతం సీట్ల లెక్కతో ప్రతిపక్ష హోదా లేకుండా చెయ్యాలని చూసింది.. వైసీపీ కాదా..? అప్పుడు ఉన్న చట్టం ఇప్పుడు ఎక్కడికి పోయిందని ట్రోల్ చేస్తున్నారు.. స్పీకర్ ఎన్నికకు సభలో అందరూ ఉండి ఎన్నికయిన సభ్యుడి పోడియం వరకు తీసుకువెళ్లి కూర్చోబెట్టాలన్న చట్టం, సాంప్రదాయం ఉందని తెలిసి ఎందుకు మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పాటించలేదో అది కూడా ఆ లేఖ లో ప్రస్తావిస్తే బావుండేది కూటమి నేతలు అంటున్నారు.. ఇప్పటి కి అధికారంలో ఉన్నట్టే భావిస్తున్న ఆ పార్టీ నేతలు మాజీలు అన్న సంగతి గుర్తుంచుకోవాలని అంటున్నారు.. అసెంబ్లీ లాబీ లోనే కాదు మాజీ సీఎం రాసిన లేఖ ప్రస్తుతం అన్ని మీడియా ల్లో చక్కర్లు కొడుతూ హల్చల్ సృష్టిస్తోంది.