వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకూ బిజేపి తో రహస్యంగా చెట్టాపట్టాల్ వేసుకుని సేఫ్ గేమ్ ఆడిన జగన్ ఇప్పుడు ఎన్డీయే తో ఢీ అంటే ఢీ అనే అవకాశం ఉందన్న టాక్ బలంగా వినిపిస్తుంది. రాజ్యసభ లో మెజార్టీ కోసం బిజేపి వైసీపీ తో ఘర్షాణాత్మక ధోరణి తో లేకపోయినప్పటికీ జగన్ ఇండియా కూటమి వైపే మొగ్గు చూపే ప్రయత్నాలు చేస్తున్నారని వినిపిస్తోంది.
ఎన్డీయే కు బొటాబొటి మెజార్టీ వుండడం అదే దశ లో ఇండియా కూటమి పుంజుకోవడం ఈ లెక్కలతోనే కాంగ్రెసు కు దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. జగన్ కేసులను తిరగదొడితే జాతీయ పార్టీ అండ కావాలన్న ధోరణి కి జగన్ వచ్చారని గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా పార్లమెంట్ సమావేశాలకు ముందు రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైసీపీ ప్రత్యేకహోదా కావాలని అడిగిందని అందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పేందుకు ప్రయత్నించి వైసిపికి క్రెడిట్ కట్టబెట్టే ప్రయత్నం చేసారు. అయినదానికి కానిదానికి కాంగ్రెస్ పార్టీ పై విరుచుకుపడే విజయసాయిరెడ్డి గాని ఇతర వైసిపి నేతలు గాని కాంగ్రెస్ పార్టీని పల్లెత్తు మాట కూడా అనడం లేదు. కాంగ్రెస్ కు దగ్గరైతే ఒక దెబ్బ కి రెండు పిల్లలు అన్నట్టుగా సోదరి షర్మిలకు చంద్రబాబు దెబ్బ కొట్టడం తో పాటు తనకు జాతీయ పార్టీ మద్దతు కూడా దక్కించుకోవచ్చాన్నది అసలు రాజకీయం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా అధికారంలో వుండడం వలన బిజేపి తో ఎంత లాయల్ గా ఉన్నా ఫలితం దక్కదు అన్న భావన తోనే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని మరికొన్ని రోజుల్లో జగన్ పై కేసుల విచారణ మోదలవ్వడం.. వివేకా హత్య కేసులోనూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అలాగే రాష్ట్రానికి సంభందించి ఈ ఐదేళ్ళ పాలనలో కొత్త విచారణలు జరిగే అవకాశం ఉందని కూడా అనుమానిస్తున్నారు. ఇలాంటి తరుణంలో జాతీయ పార్టీ అండ కావాల్సిందే నని భావిస్తున్నారట.