ఆంద్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయి ఫలితాల కోసం ప్రజలు, పార్టీల నాయకులు ఆతృతగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వాతావరణం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా.. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉంది.. నిజానికి గత కొంతకాలం నుంచి అహర్నిశలు కష్టపడ్డ నాయకులు ఈ గ్యాప్ లో హాలిడే వెకేషన్స్ కి వెళ్లడం సహజం.. ప్రతిపక్ష కూటమి నాయకులు కొద్దిగా ఎలెర్ట్ అవ్వడం తో వారు ఈ సారి విహార యాత్ర కు దూరంగా ఉన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్ట్ అనుమతి తో విదేశాలకు పయనమయ్యారు.. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రయివేటు జెట్ లో ఆయన విహారయాత్ర కి వెళ్లడం తో నెటిజన్లు ఈ ప్రయివేటు జెట్ గురించి సెర్చ్ చెయ్యడం మొదలుపెట్టారు.. విస్తా జెట్ కంపెనీ (గతంలో బొంబార్డియర్ ఏరోస్పేస్)కి చెందిన బొంబార్డియర్ గ్లోబల్ 7500 బొంబార్డియర్ ఏవియేషన్ చే అభివృద్ధి చేయబడిన అల్ట్రా లాంగ్-రేంజ్ బిజినెస్ జెట్లు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార జెట్లు. గంటకి 12 లక్షలు కి వసూలు చేసే బొంబార్డర్7500లో పడకలతో పాటు 14 సీట్లు మాత్రమే ఉంటాయి.. సెప్టెంబర్ 28, 2018న ట్రాన్స్పోర్ట్ కెనడా ద్వారా టైప్ సర్టిఫై చేయబడి 20 డిసెంబర్ 2018న సేవలోకి ప్రవేశించిన తొలుత 7000 అని పేరు పెట్టిన ఈ విమానం ట్రాన్స్సోనిక్ వింగ్ మరియు 4 ప్రాంతాలు లేదా “జోన్లు” కలిగిన క్యాబిన్. 7500 7,700 nmi (14,300 km) పరిధిని కలిగి ఉంది. ఏరోడైనమిక్ ప్రొఫైల్‌ను మార్చకుండా రెక్క బరువును తగ్గించడం కోసం దీనిని రీ డిజైన్ చేశారు.. ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్లై-బై-వైర్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ సీసీరీస్పై ఆధారపడి ఉంటుంది ఎయిర్‌ఫ్రేమ్ ఇతర విమానాల మాదిరిగానే అల్యూమినియం-లిథియం మిశ్రమాలను ఉపయోగిస్తుంది అత్యంత విలాసవంతమైన ఈ విమానం గన్నవరం కి గురువారమే రప్పించారు.. శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విమానం లో లండన్ బయల్దేరారు..