వేసవి సందర్భంగా ప్రత్యేక రైళ్లతో పాటు విజయవాడ రైల్వే అధికారులు స్పెషల్ భోజనమూ అందిస్తున్నారు. ఎకానమీ మీల్స్ పేరుతో 20 లకే నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం రైల్వే స్టేషన్ లో జనరల్ బోగీలు ఆగే చోట ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇరవై రూపాయలకు ఎకానమీ మీల్స్, ఏభై రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తున్నారు. ఐఆర్ సీటీసీతో కలిసి ఈ ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వేసవి పూర్తయ్యే వరకూ ఈ స్పెషల్ కౌంటర్ ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కౌంటర్లను ప్రయోగాత్మకంగా విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో మాత్రమే ఏర్పాటు చేసినట్లు సౌత్సెంట్రల్ రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ వివరించారు.
previous post
next post