Vaisaakhi – Pakka Infotainment

సముద్ర శక్తి-23 కి INS కవరట్టి

దాయాది శత్రువులకు బలమైన హెచ్చరికలను పంపే విధంగా భారత్ అమ్ములపొది లో 2020 లో చేరిన యాంటీ స‌బ్‌మెరైన్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కవ‌ర‌ట్టి భారతదేశం-ఇండోనేషియా ద్వైపాక్షిక వ సముద్ర శక్తి-23 నాల్గవ ఎడిషన్‌లో పాల్గొనేందుకు ఇండోనేషియా కు చేరుకుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ రాజధాని నగరమైన కవరట్టి పేరు మీదుగా నిర్మించిన ఈ యుద్ద నౌక మే 14 నుంచి 19 వరకు జరిగే సముద్ర శక్తి23 లో పాల్గొననుంది ప్రాజెక్ట్‌ 28(కమోర్టా క్లాస్‌) లో భాగంగా నిర్మించిన నాలుగు యాంటీ సబ్ మెరైన్ యుధ్దనౌక లో నాలుగవది. డైర‌క్ట‌రేట్ ఆఫ్ నేవ‌ల్ డిజైన్ .. ఐఎన్ఎస్ కవ‌ర‌ట్టిని డిజైన్ చేసింది. కోల్‌క‌తాకు చెందిన గార్డెన్ రీస‌ర్చ్ షిప్‌బిల్డ‌ర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని నిర్మించిన కవరట్టి తో పాటు ఇండియన్ నేవీ డోర్నియర్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ మరియు చేతక్ హెలికాప్టర్ కూడా పాల్గొంటున్నాయి. ఇండోనేషియా నౌకాదళానికి చెందిన KRI సుల్తాన్ ఇస్కందర్ ముడా, CN 235 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ మరియు AS565 పాంథర్ హెలికాప్టర్ ప్రాతినిధ్యం వహిస్తాయి. హార్బర్ దశలో క్రాస్ డెక్ విజిట్‌లు, ప్రొఫెషనల్ ఇంటరాక్షన్‌లు, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ ఎక్స్‌ఛేంజ్‌లు మరియు స్పోర్ట్స్ ఫిక్చర్‌లు లతో పాటుబోర్డింగ్ కార్యకలాపాలు కూడా ఇందులో వుంటాయని తెలిపారు. సముద్ర శక్తి -23 రెండు నౌకాదళాల మధ్య ఉన్నత స్థాయి సుహృద్భావ చర్యలు కొనసాగించేలా చెయ్యడమే కాకుండా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం పట్ల వారి భాగస్వామ్య నిబద్ధతను ప్రదర్శిస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More