ఆషాడం వచ్చిందంటే చాలు.. ఆడపడుచులంతా గోరింటాకు వైపు చూస్తారు.. అరచేయి ఎంత ఎర్రబడితే అంత శుభం అని భావిస్తుంటారు.. వివాహలలో ఏకంగా మెహందీ ఫంక్షన్ అని ప్రత్యేకంగా చేస్తున్నారంటే దానికి ఉన్న ప్రాధాన్యత మనం అర్ధం చేసుకోవచ్చు.. గోరింటాకు కేవలం చేతులను ఎర్రబరిచే ఓ సౌందర్య అలంకరణేనా.. మరింకేమైన విశేషం ఉందా..? నిజానికి ఇది గౌరింటాకు… గౌరి ఇంటి ఆకు…. గౌరీదేవి తన చెలికత్తె లతో వనంలో ఆటలాడే సమయంలో రజస్వల అవ్వడం తో ఆ రక్తపు చుక్క నేలను తాకి ఓమొక్క పుడుతుంది. ఈవింతను చెలికత్తె లు పర్వతరాజుకు ఈ విషయం చెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే పెద్దదైన వృక్షం నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించిన నేను నా ప్రయోజనం ఏంటీ..అని అడగగా గౌరిదేవి చెట్టు దగ్గరికి వెళ్లి ఆకు కోసిన తరువాత ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అయ్యో బిడ్డచేయి కందిపోయినదనుకునే లోపుగానే పార్వతి నాకు ఏవిధమైనబాధా కలుగలేదు పైగా చాలా అలంకారంగా అనిపిస్తోందీ అంటుంది. పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది. రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు, స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకారవస్తువుగా వాడబడుతుంది.అదే ఈచెట్టుజన్మకు సార్ధకత అని పలుకగా గౌరితో సహా అందరూ ఆ చెట్టు ఆకుల తో చేతులు కాళ్లూ అందంగా అలంకరించుకుంటారు.. ఆసమయంలో కుంకుమకు ఒక సందేహం వస్తుంది. నుదుటన కూడాఈ ఆకు తో బొట్టు దిద్దుకుంటారేమో అని తన ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందేమోనని గౌరిదేవి తో సందేహం వ్యక్త పరచగా నుదుటన పండదు అంటుంది. అందుకే గోరింటాకు నుదుటన పండదు. ఇక శాస్త్రపరంగా గర్భాశయదోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాననాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తుందిగోరింటాకు. ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి ఆబాలింతచేత మింగిస్తే ప్రసవంవలన ఏర్పడే గర్భాశయబాధలు నయం ఔతాయి. ఇక భర్తకి గోరింటకుకి గల అనుబంధం స్త్రీలోని స్త్రీత్వపు హార్మోనుల పనితీరు చక్కగా ఉన్నందు వలన దేహంకూడా అందంగా సున్నితంగా ఉంటుంది. అలా లేతగా ఉన్నచేతపెట్టుకున్న గోరింటాకు మరింత అందంగా పండి కనిపిస్తుంది. అలా పండటం అనేది ఆమె ఆరోగ్యాన్ని సూచిస్తుంది.. ఇక ఆషాడం ప్రత్యేకత ఏంటంటే సంవత్సరానికొకసారి పుట్టింటికి అంటే పార్వతి దగ్గరికి వెళ్తుందని ఆ సమయంలో గోరింటాకు అలంకరణ గా దరిస్తే. మనకూడా పార్వతి దేవిని దర్శించినట్టే అన్నది భావన అని పెద్దలు చెప్తారు.. అందుకే ఆషాఢమాసంలో అక్కడున్నపుడు తనను మరచిపోకుండా ఉండాలని గోరింటాకు కోరిన కోర్కెను పార్వతీ దేవి ఈ విధంగా అనుగ్రహించిది.
previous post