- ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో.
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. మూడు తరాలు నన్ను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. భారతీయుడు రిలీజ్ అయినప్పుడు ఈ సీక్వెల్ గురించి ఆలోచించలేదు. భారతీయుడు భారీ హిట్ అయింది. డబ్బులు వస్తాయా? అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్‌కి పెట్టే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. శంకర్ గారి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్ప స్థానం ఉంది. నా జీవితంలో తెలుగుకి గొప్ప స్థానం ఉంది. మరో చరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం వంటివి నా జీవితంలో వచ్చాయి. బాలచందర్, విశ్వనాథ్ వంటి వారు భాషాబేధాలను తుడిచిపారేశారు. ఇండియన్ 2 ఇప్పటి తరానికి రిలవెంట్‌గా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తరువాత మళ్లీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావడం అదృష్టం. ఇన్నేళ్లు నన్ను స్టార్‌గా నిలబెట్టారు. ఈ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను. ప్రతిభను పట్టుకొచ్చి అందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. సినిమానే మీ అందరితో మాట్లాడుతుంది. ఈ మూవీ సెట్‌లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదని అన్నారు. నాలో సేనాపతి వచ్చాడు. అందుకే కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు. ఇండియన్ 2 జూలై 12న రాబోతోంది. అందరూ చూడండి. ఈ మూవీకి నేను అభిమానిని. చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. మంచి క్వాలిటీతో సినిమాను తీశామన్నారు..
డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘భారతీయుడు అయిన తరువాత చాలా సినిమాలు తీశాం. లంచం తీసుకునే వార్తలు చూస్తూనే ఉంటున్నాను. ఆ వార్తలు చూసినప్పుడల్లా నాకు సేనాపతి గుర్తుకు వస్తుంటాడు. కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. తరువాత నాకు స్టోరీ సెట్ అయింది. ఆ కథను కమల్ సర్‌కి చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. భారతీయుడు సినిమాకు గెటప్ కోసం తోట తరణి గారికి కమల్ హాసన్ గారి ఫాదర్, బ్రదర్స్ ఫోటోలన్నీ ఇచ్చాను. ఆయనిచ్చిన లుక్ చూసి షాక్ అయ్యాను. భారతీయుడు 2 సినిమా సెట్‌లోకి సేనాపతిగా కమల్ హాసన్ గారిని చూసి నాకు ఒక గూస్‌బంప్స్ వచ్చింది. ఆడియెన్స్‌కి కూడా అలాంటి ఫీలింగే వస్తుంది. నేను రాసిన దాని కంటే.. ఆయన నటించిన తరువాత ఆ సీన్ స్థాయి పదింతలు పెరుగుతుంది.అలాంటి నటులు దొరకడం అదృష్టం. రోప్ మీద ప్రోస్థటిక్ మేకప్‌తో నాలుగు రోజులు షూట్ చేశాం. ఆయనలా నటించే వారు ఈ వరల్డ్‌లోనే లేరు. బాయ్స్ సినిమాతో సిద్దార్థ్‌ను నేను పరిచయం చేశాను. ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. సిద్దార్థ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. ఇంత వరకు నేను తెలుగులో ఒక్క సినిమా చేయలేదు. ఏ ఎం రత్నం వల్లే నా సినిమాలన్నీ ఇక్కడకు వచ్చాయి. ఇక్కడ నన్ను ఎక్కువగా ఆదరించారు. ఇక్కడి ఆడియెన్స్ కోసం ఒక తెలుగు సినిమాను చేయాలని అనుకున్నాను. అదే గేమ్ చేంజర్. ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ అయిపోయింది. రామ్ చరణ్‌ది ఎక్స్‌లెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయనలో ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా? అని అనిపిస్తుంది. గేమ్ చేంజర్ సినిమా చూస్తే మీకు అది తెలుస్తుందన్నారు.
నటుడు, దర్శకుడు ఎస్.జె.సూర్య మాట్లాడుతూ.. ‘ఎప్పుడెప్పుడు సినిమా వస్తే చూద్దామా? అనే ఆత్రుతలో అందరూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇండియన్ 2, గేమ్ చేంజర్, ఇండియన్ 3లో నటించాను. నాకు ఎంతో అదృష్టం ఉందనిపిస్తుంది. ఈ రెండో పార్టులో నాది క్యామియోలా ఉంటుంది. మూడో పార్టులో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. కమల్ హాసన్ గారికి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మార్క్ ఆంటోనిలో నేను గడ్డం పెట్టుకుని నటించేందుకు చాలా కష్టపడ్డాను. కానీ కమల్ హాసన్ గారు ఈ వయసులోనూ ప్రోస్థటిక్ మేకప్‌తో ఉదయం నుంచి రాత్రి వరకు అలానే ఉండేవారు. ఆయనకు సినిమా పట్ల ఉండే అంకిత భావం ముందు మనం ఎంత డబ్బు ఇచ్చినా తక్కువే అవుతుంది. ప్రేమతో మాత్రమే దాన్ని కొలవగలం. ఆయన దగ్గర్నుంచి ఎంతో నేర్చుకున్నానన్నారు.
హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘20 ఏళ్ల క్రితం బాయ్స్ సినిమా ఆడియో లాంచ్ కోసం హైద్రాబాద్‌కు వచ్చాను. ప్రతీ యూత్‌కి బాయ్స్ సినిమా ఎక్కుతుందని నన్ను హీరోగా పెట్టి శంకర్ గారు సినిమా తీశారు. మళ్లీ 20 ఏళ్ల తరువాత ప్రతీ భారతీయుడుకి ఈ భారతీయుడు 2 ఎక్కుతుందని నన్ను మళ్లీ హీరోగా తీసుకొచ్చారు. నన్ను డిస్కవర్ చేసిన నా కొలంబస్ శంకర్ గారికి థాంక్స్. ఇంత వరకు నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా నాకు ఇష్టమైన హీరో ఎవరంటే కమల్ హాసన్ గారు అని చెబుతూనే వచ్చాను. ఆయనతో ఇలా కలిసి నటించడం, ఆయనతో కలిసి ఇలా కూర్చోవడం ఆనందంగా ఉందన్నారు.. హీరోయిన్ రకుల్ ప్రీత్, నటులు బ్రహ్మానందం, సముద్రఖని, .
బాబీ సింహా, సుద్దాల అశోక్ తేజ , కాసర్ల శ్యాం, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొని ప్రసగించారు.