హైదరాబాద్ మెట్రో రైల్(L&T)
కి వర్క్‌ప్లేస్ కల్చర్ రంగంలో యాక్టివ్‌గా ఉన్న గ్లోబల్ ఏజెన్సీ అయిన గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా ద్వారా మిడ్-సైజ్ ఆర్గనైజేషన్ కేటగిరీలో ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్’గా సర్టిఫికేట్ అందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సర్టిఫికేట్ పొందిన ఏకైక సంస్థగా హైదరాబాద్ మెట్రో గుర్తింపు పొందింది. తొలి ప్రయత్నంలో 92 అధిక ట్రస్ట్ ఇండెక్స్ స్కోర్‌ను అందుకున్న కొద్ది సంస్థలలో ఇది ఒకటని సంస్థ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ (CEO) కేవీబీ రెడ్డి తెలిపారు.
జూన్ 2024 నుండి జూన్ 2025 వరకు చెల్లుబాటు అయ్యే ఈ సర్టిఫికేషన్ మా ఉద్యోగుల అంకితభావం మరియు కృషికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. వర్క్ ఎన్వార్మెంట్ మరింత మెరుగుపరచడానికి సర్టిఫికేషన్ రాడానికి కారణమైన ఎంప్లాయిస్ కి అత్యుత్తమ అవకాశాలను అందించడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ప్రధాన మానవ వనరుల అధికారి బినో జోస్ మాథ్యూ అందించిన సహకారాన్ని ఆయన అభినందించారు.
previous post