భూమి మీద ఉండే జీవులలో మనిషి ఒక విభిన్నమైన వాడు.తన మనుగడ కోసం, తన జాతి అభివృద్ధి కోసం చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగాలు ఇతర జీవుల కంటే అతనిని ఒక ఉన్నతమైన వాడిగా నిలబెట్టాయి.మొదట్లో ఆహారం కోసం, తన ప్రాణ రక్షణ కోసం పడరాని పాట్లేన్నో పడ్డాడు.నేడు తనకు మాత్రమే కాకుండా తన ముందు తరాల వారికి కూడా అన్ని సమకూర్చుకునే స్థితిలో ఉన్నాడు.అతని మేధస్సు ప్రపంచ గతినే మార్చేసింది.రాళ్లు కొట్టి అగ్గి పుట్టించే స్థాయి నుంచి నేడు ఇతర గ్రహాలకు రాకెట్లను పంపించే స్థాయికి ఎదిగిపోయాడు.తను చేసే ప్రతి పని, కనుగొనే ప్రతి వస్తువు పని సమయాన్ని, ప్రయాసను, డబ్బును తగ్గించే విధంగా ఉంటుంది.ఒక విధంగా చెప్పాలంటే భూమి మీద విలాసంగా బతికే జీవులలో మానవుడు ముందు ఉన్నాడు. ఇప్పుడు తన మేధస్సుకు మరింత పదును పెట్టాడు. మనిషి వృద్ధాప్యంలో లేదా ఇతర కారణాలతో మరణించడం వస్తుంది. ఇప్పుడు మనిషికి అస్సలు చావే లేకుండా ఉంటూ ఎలా ఉంటాది అనే ఆలోచన చేశాడు.ఈ మేరకు కూడా తన ప్రయత్నాలను ప్రయోగాలను మొదలు పెట్టేసాడు.మనం చావాలో వద్దా అనేది మనమే నిర్ణయించుకోనేలా చేస్తున్న ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా జన్యు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.వేరి అభిప్రాయాలతోమరో 22 ఏళ్లలో చావు ‘ఆప్షనల్’అందుబాటులోకి రానున్నదనే ప్రచారం కూడా జరుగుతుంది. వయస్సు పెరగకుండా కూడా తగ్గించవచ్చని ‘ది డెత్ ఆఫ్ డెత్’ పుస్తకావిష్కరణలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2045 కల్లా కేవలం ప్రమాదాల ద్వారానే చావు సంభవిస్తుందన్నారు. జన్యుప్రక్రియ ద్వారా మరణించాలో లేదో ఎంచుకోవచ్చన్నారు.అదే కనుక నిజంగా జరిగితే మానవులు కూడా భూమిమీద చిరంజీవులుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.అయితే ప్రమాదాల ద్వారా సంభవించే మరణాలను అడ్డుకునే అవకాశం లేదు. మనిషి తన చావును తానే డిసైడ్ చేసుకునే అవకాశం అతనికే ఉండటం మరో విశేషం. మనిషి వయసు పెరగకుండా నిత్య యవ్వనంగా ఉండేలా ప్రస్తుతం ప్రయోగాలు కొనసాగుతున్నాయి.అయితే ఎప్పటికైనా సరే జన్యు శాస్త్రవేత్తలు చెప్పేది కచ్చితంగా జరుగుతుందనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
next post