Vaisaakhi – Pakka Infotainment

హిట్ ఫట్ ల మధ్య 2022

ఈ ఏడాది చాలా సినిమాలే వచ్చాయి.
కొన్ని స్టోరీ లైన్ బాగా లేకున్నా మంచి కలెక్షన్లు సాధించాయి.
మరికొన్ని సినిమాలు
టీజర్లు, ట్రైలర్లు, కాంబినేషన్లతో ఆశలు రేకెత్తించి థియేటర్ లో నిరాశకు గురిచేసాయి.
చిన్న పెద్ద అన్న తేడా లేకుండా భారీ ప్లాప్ లను మూట గట్టుకున్న సినిమాలు
ఈ ఏడాది లో చాలానే ఉన్నాయి.
ఇక్కడ స్టార్ హీరో నా.., కుర్ర హీరోనా అన్న లెక్కలేమి వర్కవుట్ అవ్వలేదు
కంటెంటే ఆన్సర్ ఇచ్చింది. మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలన్నీ సక్సెస్ అయ్యాయి. సంవత్సర ఆరంభం లొనే 1945 సినిమా ప్లాప్ సినిమాగా ముద్ర వేసుకుని అశుభం గా అడుగు పెడితే అదేబాటలో ఇందువదనా,
అతిథిదేవోభవ సినిమాలు కూడా అపజయాన్ని మూటగట్టుకున్నాయి
అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన
బంగార్రాజు హిట్ మూవీగా నిలిచింది.
తర్వాత రిలీజ్ అయిన రౌడీ బాయ్స్,
సూపర్ మచ్చి, హీరో, ఉనికి, గుడ్ లక్ సఖి సినిమాలు భారీ ప్లాపుని చవిచూశాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ అయి డిజాస్టర్ గా నిలిచింది.ఇక షెహరి,మళ్ళీ మొదలైంది
చిత్రాలు ఫెయిల్ అయితే చాలా ఏళ్ల తర్వాత సిద్దు జొన్నలగడ్డ
చేసిన డి.జె టిల్లు మూవీ ఊహించని విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ రాబోతుంది ఇక సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఇదే కోవలోకి వర్జిన్ స్టోరీ మూవీ వచ్చి చేరింది. ఈ మూవీ కూడా
అపజయాన్ని చూసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో వచ్చిన భీమ్లా నాయక్ ఓ మాదిరి
విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.
తర్వాత వచ్చిన
సెబాస్టియన్ మూవీ ప్లాప్ కాగా
ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ బిలో యావరేజ్ గా ఆడింది.భారీ అంచనాలతో పాన్ ఇండియన్ మూవీ గా రిలీజ్ అయిన
ప్రభాస్ రాధే శ్యాం
చిత్రం ఓపెనింగ్స్ బాగున్నప్పటికీ
లాంగ్ రన్ లో చతికల పడి డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన
స్టాండ్ అప్ రాహుల్ మూవీ ఫ్లాప్ కాగా
రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన
ఆర్. ఆర్. ఆర్. మూవీ
పాన్ ఇండియన్ రేంజ్ లో ర భారీ వసూళ్లను రాబట్టి
బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది.
యష్ హీరోగా వచ్చిన పాన్ ఇండియన్
మూవీ
కెజిఫ్-2 బ్లాక్ బస్టర్ కొట్టింది.
మిషన్ ఇంపాజిబిల్,
గని మూవీ లతో పాటు
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో భారీ అంచనాలతో రిలీజ్ అయిన
ఆచార్య మూవీ డిజాస్టర్ అయ్యింది.
జయమ్మ పంచాయతీ, తర్వాత రిలీజ్ అయిన
భళా తందనాన మూవీలు ప్లాప్ మూవీలుగా నిలవగా
విశ్వక్సేన్ నటించిన
అశోక వనములో అర్జున కళ్యాణం యావరేజ్ గా ఆడింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ కాంబినేషన్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన
సర్కారు వారి పాట మూవీ హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికి పూర్తి స్థాయిలో వసూళ్లు సాదించలేదన్నది ట్రేడ్ టాక్.
యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ డైరెక్షన్లో
మలయాళం మూవీ ని
శేఖర్ పేరుతో
రిమేక్ చేసి
అపజయాన్ని చవి చూశారు.
విక్టరీ వెంకటేష్, మెగా ఫప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబోలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన
F3 మూవీ, అలాగే మహేష్ బాబు నిర్మాతగా
అడవి శేషు
మేజర్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇక నాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి చిత్రం
యావరేజ్ గా మొదలై ఫైనల్ రేసు లో చాప చుట్టేసింది.
రానా విరాట పర్వం,
సత్యదేవ్ గాడ్సే,
రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన
కొండా మూవీలు
బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి.
ఇక చిన్న సినిమాలు
సమ్మతమే,
చోర్ బజార్,
సదా నన్ను నడిపే,
7 డేస్ 6 నైట్స్
మూవీలు ప్లాఫ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి.
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో వచ్చిన
పక్క కమర్షియల్ మూవీ కూడా ఫ్లాప్ గానే మిగిలింది. తర్వాత రిలీజ్ అయిన
టెన్త్ క్లాస్ డైరీస్,
షికారు, నాగచైతన్య
థాంక్ యు , రవితేజ నటించిన
రామారావు ఆన్ డ్యూటీ, మూవీలు భారీ డిజాస్టర్ లు గా మిగిలాయి.
ఆ తర్వాత రిలీజ్ అయిన
హ్యాపీ బర్త్డే,
అలాగే హీరో రామ్ చేసిన ద్విభాషా చిత్రం
వారియర్ కూడా
అపజయాన్ని చూశాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన
బింబి సార
మంచి వసూళ్లను రాబట్టి
సూపర్ హిట్ గా నిలిచింది.
దుల్కర్ సల్మాన్, మృనాల్ ఠాకూర్ కాంబినేషన్ లో వచ్చిన
సీత రామం మూవీ ఊహించని విజయం సాధించి సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక నితిన్ మాచర్ల నియోజకవర్గం ప్లాఫ్ గా నిలవగా,
నిఖిల్ హీరోగా వచ్చిన
కార్తికేయ-2
వన్ ఇండియన్ రేంజ్ లో
బ్లాక్ బస్టర్ కొట్టింది. ఆ తర్వాత రిలీజ్ అయిన
తీస్మార్ ఖాన్,
హైవే మూవీలు ప్లాఫ్ కాగా, ఆ తర్వాత
విజయ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన
లైగర్ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలింది.
హెబ్బా పటేల్ నటించిన
ఓదెల రైల్వే స్టేషన్ మూవీ తో పాటు అదే సమయంలో రిలీజ్ అయిన
రంగ రంగ వైభవంగా మూవీ కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.
ఇక హీరో శర్వానంద్
ఒకే ఒక జీవితం మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి
బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించుకున్నాడు.
తర్వాత వచ్చిన
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి,
నేను మీకు బాగా కావలసినవాడిని,
శాకినీ డాకిని మూవీలు ప్లాఫ్ టాక్ తెచ్చుకుంటే
కృష్ణ వృందా విహారి
మూవీ మాత్రం యావరేజ్ గా ఆడింది.
దొంగలున్నారు జాగ్రత్త,
అల్లూరి , అక్కినేని నాగార్జున
ఘోస్ట్ మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బకెట్ తన్నేశాయ్ ఇక మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంబోలో వచ్చిన
గాడ్ ఫాదర్ యావరేజ్ గా నిలిచింది.
మూవీలో ఇద్దరు స్టార్లు ఉన్నప్పటికీ విజయాని ఆమడ దూరం లొనే ఆగిపోయింది. ఇక స్వాతి ముత్యం మూవీ బిలో ఏవరేజ్ గా నిలవగా
BFH మూవీ తో పాటు
అమ్ము మూవీ కూడా ప్లాప్ గా నిలిచాయి. ఇక మంచి విష్ణు
జిన్నా మూవీ కూడా అపజయాన్ని చూసింది. విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో విశ్వక్సేన్ హీరోగా నటించిన
ఓరి దేవుడా బిలో ఏవరేజ్ గా నిలవగా,
అనుకోని ప్రయాణం మూవీ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
LIKE షేర్ అండ్ సబ్స్క్రయిబ్ మూవీ ఫ్లాప్ కాగా, అల్లు శిరీష్ నటించిన
ఊర్వశివో రాక్షసివో మూవీ యావరేజ్ గా ఆడింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో
సమంత ప్రధాన పాత్రలో తీసిన
యశోద మూవీతో పోలిస్తే తక్కువ బడ్జెట్లో తీసి చిన్న సినిమాగా రిలీజ్ అయిన మాసూద మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లరి నరేష్
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చిత్రం
ప్లాఫ్ గా మిగిలింది. డిఫరెంట్ కాన్సెప్ట్లతో వరుస విజయాలతో దూసుకుపోతున్న అడవి శేషు నటించిన హిట్-2 మూవీ కూడా అతనికి విజయాన్ని అందించింది. తర్వాత వచ్చిన ముఖ చిత్రం,
గుర్తుందా శీతాకాలం,
పంచ తంత్రం చిత్రాలు ప్లాప్ మూవీలుగా నిలవగా, నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కాంబోలో వచ్చిన
18 పేజెస్ మూవీ ఓకే అనిపించింది
మాస్ మహారాజా రవితేజ నటించిన
ధమాకా చిత్రం బాక్సాఫీస్ వద్ద
కాసుల కురిపిస్తూ హిట్ మూవీ గా నిలిచింది.క్రేజీ ఫెలో,
తగ్గేదేలే మూవీ,
బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ లు ఫ్లాప్ అయ్యాయి.సుధీర్ నటించిన
గాలోడు మూవీ యావరేజ్ కలెక్షన్స్ సాధించింది
ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే విశ్వ నాయకుడు కమల్ హాసన్
నటించిన
విక్రమ్ మూవీ పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ అయ్యి
సూపర్ హిట్ గా నిలిచింది.
ఇక కార్తీ హీరోగా వచ్చిన
సర్దార్ మూవీ కూడా సూపర్ హిట్ అయింది. అజిత్
వలీమై ప్లాప్ కాగా, తిరు మూవీ యావరేజ్ గా ఆడింది.
కాస్టింగ్ తో భారీ బడ్జెట్ తో మణిరత్నం డైరెక్షన్లో రూపొందించిన
పొన్నియన్ సెల్వం -1 తెలుగులో ఫ్లాప్ మూవీగా నిలిచింది. కన్నడ నుంచి వచ్చిన కాంతారా మూవీ బ్లాక్ బస్టర్ అయి భారీ వసూళ్లను రాబట్టుకుంది.
అలాగే డాన్ మూవీ హిట్ కాగా
ప్రిన్స్ మూవీ ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.
తమిళ్ హీరో విజయ్ నటించిన బీస్ట్ అలాగే హే సినామిక, ఫైర్, మట్టి కుస్తీ,
సామాన్యుడు,లాఠీ, ఈటి మూవీలు వరుసగా బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. కన్నడ హీరో సుదీప్ నటించిన విక్రాంత్ రోనా తెలుగులో హిట్ టాక్ తెచ్చుకుంది.
ఇక కోబ్రా, కెప్టెన్ మూవీలు ప్లాప్ కాగా,
నేను వస్తున్న డిసాస్టర్ కాగా,
లవ్ టుడే సూపర్ హిట్ గా నిలిచింది.
ఇలా ఏడాదిలో
వరుసగా విడుదలైన చిత్రాలలో ప్లాప్ గా నిలిచిన చిత్రాలు అధికంగా ఉన్నాయి. కొన్ని డబ్బింగ్ మూవీలు సూపర్ హిట్ అవ్వగా స్ట్రెయిట్ తెలుగు చిత్రాలలో అత్యధిక చిత్రాలు ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నవే ఉన్నాయి.
ఇందులో కొన్ని మాత్రమే విజయనందుకున్నాయి. వచ్చే ఏడాది
సంక్రాంతితో సీనియర్ హీరోల మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మూవీలతో
మళ్లీ బాక్సాఫీస్ వద్ద హడావుడి మొదలుకానుంది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More