Vaisaakhi – Pakka Infotainment

తృటి అంటే ఏంటి..? నిముషం లో దాని వాటా ఎంత..?

కాలం గడిచిపోతే తిరిగి రాదంటారు.. నిజానికి డబ్బుకన్నా కాలమే చాలా విలువైనదని పండితులు చెప్తావుంటారు.. క్షణకాలం అటైన ఇటైన జీవన గమనమే మారిపోయే సందర్భాలు చాలా ఉన్నాయి. మనం వాడే క్షణం సెకన్ నిముషం లతో పాటు తృటి అన్న పదం చాలాసార్లు వింటుంటాం, అలాగే రెప్పపాటు కాలం అని కూడా చాలా సార్లు ప్రస్తావన లో వస్తుంది. అసలీ తృటి, రెప్పపాటు అంటే ఏమిటి? తృటి నుంచి బ్రహ్మ సమాప్తి వరకు ఓసారి పరిశీలిద్దాం..
తృటి =సెకండ్ లో 1000 వంతు
100 తృటులు =1 వేద
3 వేదలు=1 లవం
3 లవాలు=1 నిమేషం అంటే రెప్ప పాటుకాలం (నిముషం కాదు..)
3 నిమేషాలు=1 క్షణం,
5 క్షణాలు=1 కష్టం
12 కష్టాలు = ఒక నిముషం
15 కష్టాలు=1 లఘువు
15 లఘువులు=1 దండం
2దండాలు=1 ముహూర్తం
2 ముహూర్తాలు=1 నాలిక
7 నాలికలు=1 యామము,ప్రహారం
4 ప్రహరాలు=ఒక పూట
2 పూటలు=1 రోజు
15 రోజులు=ఒక పక్షం
2 పక్షాలు=ఒక నెల.
2 నెలలు=ఒక ఋతువు
6 ఋతువులు=ఒక సంవత్సరం.
10 సంవత్సరలు=ఒక దశాబ్దం
10 దశాబ్దాలు=ఒక శతాబ్దం.
10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది
100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు
4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం
8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం
12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం
17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం
పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం.(చతుర్ యుగం)
71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం
14 మన్వంతరాలు=ఒక కల్పం
200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు
365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం
100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి
ఒక బ్రహ్మసమాప్తి=విష్ణు కు ఒక పూట
మరో బ్రహ్మఉద్బవం=విష్ణువు కు మరో పూట వేల సంవత్సరాల క్రితమే కాలాన్ని ఇంత సూక్ష్మంగా, స్థూలంగా పురాణ కాలంలోనే విభజన చేసిన మన ఋషులు జ్ఞానుల విజ్ఞానానికి జోహార్లు చెప్పాల్సిందే.. సైన్స్ ఉనికిలోకి రాకముందే ఎంతో విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు అందించిన వారికి మనః పూర్వక ప్రణామాలు అర్పించాల్సిందే..(వివిధ మాధ్యమాలు, గ్రంథాల నుంచి సేకరణ)

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More