కుటుంబం లో ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏ కాదు మొత్తం బంధువర్గమంతా ప్రచారం లోకి దిగిపోతుంది.. రాత్రనక పగలనకా గెలుపు వరకు శ్రమిస్తూనే వుంటారు.. ఇప్పుడు జరుగుతున్న ఆంద్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సీన్ రివర్సయింది..ఒకప్పుడు అన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్ర మంతా పాదయాత్ర చేసి పార్టీ గెలుపుకి అధికారం లోకి రాడానికి సాయమందించిన సొంత చెల్లెలు ఇప్పుడు వేరే పార్టీ లో ఉండి అన్న ను అన్న పార్టీ ని ఓడించాలని విజ్ఞప్తి చేస్తుంటే.. ఓ అభ్యర్థి కొడుకు మా నాన్నను ఓడించండి అంటున్నాడు.. మరో అభ్యర్థి అల్లుడయితే మా మామయ్య కు ఓటెయ్యద్దు అని ఘాటు గా విమర్శిస్తున్నాడు.. మరో కీలక నేత కుమార్తె మా నాన్న మాట వినొద్దు అని ఖరాఖండిగా చెపుతోంది.. విచిత్రం ఏంటంటే ఇంటిపోరు ఎదుర్కొంటున్న ఈ నేతలంతా వైఎస్సార్ సీపి వారే కావడం విశేషం..
అనకాపల్లి ఎంపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు కుమారుడు మాడుగులలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి రవి అనకాపల్లి ఎంపీ గా పోటీ చేస్తున్న తన తండ్రిని ఓడించండి అంటూ ఆయన ప్రచారం చేస్తున్నాడు కన్న కొడుకుకు న్యాయం చేయలేనివారు ఓటేసిన ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? ఆలోచించి ఓటు వేయండి అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది…. అలాగే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ ని ఓడిస్తానని చేసిన శపధం పై కూతురు క్రాంతి రియాక్ట్ అయ్యారు. ఇష్టమైన అభ్యర్థి ని గెలిపించుకోవడం తప్పు కాదని పవన్ కళ్యాణ్ ని పిఠాపురం నుంచి తన్ని తరిమేస్తానని అనడం ముద్రగడ అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నారని తండ్రిపై తీవ్ర విమర్శలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చెయ్యడం అది వైరల్ కావడం జరిగింది.. ఇక సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు పై హైదరాబాద్ లో వైద్యుడి గా పనిచేస్తున్న ఆయన రెండో అల్లుడు గౌతమ్ తీవ్ర ఆరోపణలు చేశారు.. అంబటి రాంబాబు కు అల్లుడు కావడం అత్యంత దురదృష్టకరం అని అతనికి వ్యక్తిత్వం లేదని ఆరోపిస్తూ ఒక వీడియో ను విడుదల చేసారు ఆ వీడియోలో మరిన్ని ఆరోపణలు చేస్తూ ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ బయట పెట్టాల్సి వచ్చిందంటే వచ్చే ఎన్నికల్లో ఇలాంటి వ్యక్తి ని తిరిగి ఎన్నుకోవద్దు అని చెప్పడానికే అన్నారు.. ప్రజలు బాధ్యత తో ఇలాంటి వ్యక్తి ని కాకుండా మంచి వ్యక్తి ని ఎన్నుకోవాలని సూచించారు. రాజకీయ రంగం లో ఇలాంటివి సర్వ సాధారమైన ఆంద్రప్రదేశ్ లో జరుగుతున్న విచిత్రాలపై మాత్రం చర్చ బాగానే జరుగుతుంది.
previous post
next post