Vaisaakhi – Pakka Infotainment

హనుమాన్ చాలీసా ఎలా పుట్టిందో..? మీకు తెలుసా..?”

జయ హనుమాన జ్ఞాన గుణ సాగర్ జయ కపీస తిహులోక ఉజాగరా రామదూత అతులిత బలదామ.. అంజనీపుత్ర పవనసుత నామా… ” సర్వ దుఃఖాలను సకల భయాలను పారద్రోలే హనుమాన్ చాలీసా ను వారణాసి లో వుండే సంత్ తులసీదాసు హనుమంతునికి అక్షరాంజలిగా సమర్పించారు.. అసలు హనుమాన్ చాలీసా ను ఆయన పలకడానికి కారణం ఏంటి..? ఎప్పుడు ఆయన నోట ఇది భక్తి ధారగా వర్షించింది.. దీని వెనుక ఓ కధ ప్రచారం లో ఉంది.వారాణసిలో ఒక సదాచార పరుడయిన ఒక గృహస్తు తన ఏకైక కుమారునికి కుందనపు బొమ్మ లాంటి అమ్మాయితో వివాహం చేశాడు.వారిద్దరూ చిలకా గోరింకల్లాగా అన్యోన్యంగా కాపురం చేస్తుండగా విధి వక్రించి ఓ రోజు హఠాత్తుగా ఆ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.. ఆ అమ్మాయి గుండెలు పగిలేలా రోదించింది.ఆ యువతీ శోకానికి అందరి హృదయాలు ద్రవించి పోయాయి. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తీసుకుని వెళ్తుండగా ఎవరి మాట వినని ఆ యువతి పాడె ని అనుసరిస్తూ రాసాగింది.కొంత మంది స్త్రీలు ఆమెను గట్టిగా పట్టుకొని వారిస్తూ వున్నారు.శవయాత్ర సాగిపోతున్నది.త్రోవలో తులసీ దాసు ఆశ్రమం ముందుగా వెళుతూ వుంటే ఆ అమ్మాయి అందరినీ విడిపించుకొని ఆశ్రమములోపలికి పరుగుతీసి తులసీదాసు ముందు ప్రణ మిల్లింది. కన్నులు మూసుకొని ధ్యానం లో ఉన్న ఆ మహనీయుడు గాజుల శబ్దము విని కళ్ళు తెరచి తనకు ప్రణ మిల్లిన ఆమెను దీర్ఘ సుమంగళీ భవ…! యని దీవించారు.ఆ యువతీ మరింత బిగ్గరగా ఏడుస్తూ తండ్రీ ఈ నిర్భాగ్యురాలిని దీవించిన తమ లాంటి మహాత్ముల వాక్కుకూడా వ్యర్థమేనని దుఖిస్తున్నాను అనడం తోఅప్పుడు ఆయన అమ్మా!రామచంద్ర మాహా ప్రభు నానోట అసత్యం పలికించడే అంటే బయటకు వచ్చి చూడండి మహాత్మా! నా భర్త విగతజీవుడై శవయాత్ర చేస్తున్నాడు. అని చెప్పడంతో ఆయన లేచి వెళ్లి అయ్యా! కొంచెం ఆ పాడెను దింపండి అని ఆపించి ఆ శవం కట్లు విప్పి రామనామం జపించి తన కమండలములోని నీళ్ళు మృతదేహం పైచల్లగా చైతన్యము వచ్చి ఆ యువకుడు లేచి కూర్చుండెను. అది చూసిన జనం ఆయనకు జేజేలు పలుకుచూ భక్తీ పూర్వకముగా నమస్కరించిరి. దీనితో ఆయనకు ప్రాచుర్యం పెరిగి ప్రజలు తండోప తండాలుగా వచ్చి ఆయనను దర్శించి రామనామ దీక్ష తీసుకుని రామ నామాన్ని జపించటం ఎక్కువై పోయింది.నిత్యం రామగాన నిరతుడయి బ్రహ్మా నందము లో తేలియాడే ఆయన సమక్షంలో యెంతో మంది యితర మతాల వారు కూడా రామ భజన పరులు కావడంజరుగుతుండేది అయితే కొంతమంది మతగురువులకు యిది కంటగింపుగా వుండేది.వారు తులసీదాసు మత మార్పిడులకు పాల్పడుతున్నాడని మన మతాన్ని కించ పరుస్తున్నాడని ధిల్లీ పాదుషా వారికి అభియోగాలు పంపుతూ వుండేవారు.ఇది యిలా వుండగా మహమ్మదీయ గురువులు ధిల్లీ పాదుష వారి దగ్గర కి వెళ్లి తులసీదాసు రామనామము గొప్పదని అమాయకులైన ప్రజలను మోసగిస్తున్నారని ఫిర్యాదు చేసారు. దానితో పాదుషా నుంచి తులసీదాసుకు పిలుపు వచ్చింది..అన్నిటికన్నా రామనామం గొప్పదని ప్రచారము చేస్తున్నారట నిజమేనా..? అని ప్రశ్నిస్తే .అందుకు తులసీదాసు అవును ప్రభూ సృష్టి లో సకలమునకూ ఆధార మయినరామనామ మహిమను వర్ణించ నెవరి తరము? రామనామము తో సాధించ లేనిది ఏదీ లేదు.అని సమాధానమిచ్చెను.. అయితే దాన్ని మేము పరీక్షించదలచాం.. ఒక శవము ను తెప్పించేదము దానికి ప్రాణం పోసి మీ మహత్వమును నిరూపించుకోండి.అన్నాడు పాదుషా. అప్పుడు తులసీదాసు క్షమించండి పాదుషా గారూ జనన మరణాలని ఆపేందుకు మన మెవరము? అంతా ఆ ప్రభువు ఇచ్చానుసారాము గా జరుగు తాయి.మన కోరికలతో ఆయనకు పని లేదు.అన్నాడు.అప్పుడు పాదుషా రామనామము అంతా మోసమని మీరు చెప్పేవి అన్నీ అబద్దాలని ఒప్పుకోండి.లేకపోతె మీకు శిక్ష తప్పదు అని బెదిరించాడు.తులసీదాసు ఒప్పుకోన లేదు.అప్పుడు ఆయనను బంధించమని తన సైనికులను ఆజ్ఞాపించాడు పాదుషా .తులసీదాసు మాత్రము చలించకుండారామనామము జపిస్తూ ధ్యాన నిమగ్నుడయితే సైనికులు ఆయనను బంధించుటకు రాగా ఎక్కడినుండి వచ్చినాయో వేల కోతులు వచ్చి సైనికుల ఆయుధాలు లాగుకొని వారికే గురిపెట్టి వారిని కదలనీ కుండా చేశాయి.అందరూ ఏ కోతి తమ మీద పడి కరుస్తుందో అని హడలి పోతూ పరుగులు తీశారు.ఈ కలకలానికి కారణ మేమని తులసీదాసు కనులు తెరిచి చూశాడు.ఆయనకు సింహ ద్వారము మీద హనుమంతుడు కనిపించాడు.ఆయన దర్శనముతో పులకించిపోయి 40 దోహాలతో “జయ హనుమాన జ్ఞాన గుణ సాగర “అంటూ చాలీసానుఆశువు గా గానం చేశాడు.అప్పుడు . హనుమంతుడు ఈ స్తోత్రం తో మాకు ఆనందమును కలిగించావు.నీకేమి కావాలో కోరుకో అని అడిగాడు. మహాత్ము లెప్పుడూ తమకోసం గాక పరుల కోసమే బ్రతుకు తారు కదా! అప్పుడు తులసీదాసు తండ్రీ ఈ స్తోత్రం తో నిన్ను స్తుతించిన వారికి తమరు అభయమిచ్చి కాపాడాలని నా కోరిక అన్నాడు.దానితో సంతోషించిన హనుమంతుడు తులసీ! మాకు అత్యంత ప్రీతీ పాత్ర మయిన ఈ చాలీసా తో నన్నెవరు స్తుతించినా వారి రక్షణ భారాన్ని నేను వహిస్తాను అని వాగ్దానం చేశారు.అప్పటినుండీ యిప్పటి వరకూహనుమాన్ చాలీసా భక్తుల అభీష్టాలను కామధేనువై తీరుస్తూనే వున్నది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More