Vaisaakhi – Pakka Infotainment

ఏపీలో 17 వరకు ఒంటిపూట బడులు

ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు ,వృద్ధులు, గర్భిణులు ఎండల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వృద్ధులు ఎండలకు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఏదైనా అత్యవసరం పని ఉంటే తప్ప బయటకు రావడానికే చాలా మంది భయపడుతున్నారు. ఈ పరిస్థితిలో ఈనెల 12 నుంచి ఆంధ్రప్రదేశ్ లో స్కూలు పున ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా ఎండల ప్రభావం ఎక్కువగా ఉండటంతో స్కూలు టైమింగ్స్ లో మార్పులు చేశారు. ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాఠశాలలు ఉదయం ఏడున్నర గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకే తరగతుల నిర్వహణ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున రీ-ఓపెన్ తేదీని వాయిదా వేయాలన్న వినతులను పరిగణలోకి తీసుకున్న సర్కార్ ఈ మేరకు ఒంటిపూట బడుల నిర్వహణకు మొగ్గు చూపింది. దీంతో ఉదయం 8:30 నుంచి 9:00 గంటల మధ్యలో విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఏపీలో ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్ రెండో వారం ముగిసిపోతున్నా సూర్యుడు ఇంకా భగభగమంటున్నాడు అధిక ఉష్టోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారీ ఎండల నేపథ్యంలో ప్రభుత్వం వేసవి సెలవులపై మరోసారి ఆలోచించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. అటు ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా స్కూల్స్ పున: ప్రారంభాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దృష్టిగా మరో వారం రోజుల వరకు స్కూళ్లకు హాలిడేస్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మాత్రం స్కూళ్లను రీ- ఓపెన్ చేయడానికే ముగ్గు చూపుతుంది. ఏపీ సర్కార్ నిర్ణయం మాత్రం సర్వత్ర విమర్శలు బలివెత్తుతున్నాయి. చిన్నారుల జీవితాలతో ఆటలాడ వద్దంటూ పలువురు హితవు చెబుతున్నారు. ఎండల ప్రభావంతో విద్యార్థులకు అనారోగ్య సమస్యలు నెలకొంటే దానికి ప్రభుత్వ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More