Vaisaakhi – Pakka Infotainment

‘ నాటు నాటు ‘ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు

అంతర్జాతీయ ఫ్లాట్ ఫామ్ మీద ఆర్.ఆర్.ఆర్ మూవీ సంచనాలను సృష్టిస్తుంది. విదేశీయులందరినీ ఈ మూవీ మెస్మరైజ్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్.ఆర్.ఆర్ మూవీ హవా కొనసాగుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ మూవీ ద్వారా ఇండియన్ సినీ ఇండస్ట్రీకి మంచి గుర్తింపు వచ్చింది. రెండు విభాగాలలో పోటీపడిన ఆర్.ఆర్.ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2023 కి గాను బెస్ట్ సాంగ్స్ లో విన్నర్ గా నిలిచింది. ప్రముఖ హాలీవుడ్ అవార్డ్స్ లో ఒకటైనటువంటి గోల్డెన్ గ్లోబ్స్ అవార్డు లలో బెస్ట్ సాంగ్స్ లో విన్నర్ గా నిలవడం పట్ల భారతీయులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కంపోజ్ చేసిన సాంగ్ “నాటు నాటు” సాంగ్ ఎంతటి సంచలనం నమోదు చేసిందో అందరికీ తెలిసిందే.ఈ అంతర్జాతీయ స్థాయిలో గోల్డెన్ క్లబ్ అవార్డు ను గెలవడం పట్ల ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ, ఇక్కడ ప్రేక్షకులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటకు కంపోజ్ చేసిన ఎం.ఎం. కీరవాణి, స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకులు రాజమౌళి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సినిమాటోగ్రాఫర్ సెందిల్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా భారతీయుల గర్వపడే విధంగా గుర్తింపు తీసుకొచ్చినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు, అలాగే తెలుగు వాళ్ళు తమ అభినందనలు తెలియజేస్తున్నారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించిన ఏ మూవీ అయిన సరే కచ్చితంగా ఆస్కార్ అవార్డు తీసుకుంటుందనే ప్రచారం ఉంది. తప్పకుండా ఈ సాంగ్ కూడా ఆస్కార్ అవార్డు సాధించడం ఖాయమని అభిమానులు పేర్కొంటున్నారు. ఆరోజు తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గోల్డెన్ క్లబ్ అవార్డు ఫంక్షన్ లో ఈ అవార్డు ని అనౌన్స్ చేయగా ఎంఎం కీరవాణి వెళ్లి ఆ అవార్డును అందుకోవడం మధురమైన అనుభూతిని ఆర్.ఆర్.ఆర్.టీమ్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సంతోషకర మూమెంట్ తో చిత్ర యూనిట్ అంతా అక్కడే ఉండగా పట్టరాని ఆనందంతో ఆ ఈవెంట్ లో సంతోషం వ్యక్తం చేసారు. ఇలాంటి న్యూస్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ సహా నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ ఆ వీడియో క్లిప్స్ ని షేర్ చేసి సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేసింది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More