గత రెండు మూడు సంవత్సరాలుగా మార్కెట్లో పాత ఐదు రూపాయల కాయిన్స్ చెలామణి అంతంత మాత్రంగానే వుంది. అంతకు ముందు ఉన్న నాణేలన్ని ఏమైపోయాయి.. ఇళ్ళల్లో దాచేసుకున్నారా..? అలా ఎన్నని దాచేస్తారు.. ఐదు రూపాయల కాయిన్స్ అదృశ్యం వెనుక ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.. ఇక్కడ మనం ఐదు రూపాయల కాయిన్ ని అదే ముఖ విలువ తో మార్చుకుంటున్నాం అయితే ఇక్కడి మన నాణెం తో ఆ దేశంలో 12రూపాయలు సంపాదించేస్తున్నారు..వినడానికి ట్రాష్ అనిపించినా ఇది నిజం. ఒక కాయిన్ సర్ఫేస్ వాల్యూ ఆ కాయిన్ విలువను నిర్ణయిస్తుంది.ఐదు రూపాయల కాయిన్ సర్ఫేస్ వాల్యూ ఐదే సూచిస్తుంది. మరోవైపు.. కాయిన్ తయారీ కోసం ఉపయోగించిన ఖనిజం దాని మెటల్ విలువను సూచిస్తుంది. అయితే, మార్కెట్లో విలువ మారిన కొలది మెటల్ విలువ మారుతుంటుంది. దీంతో పాత కాయిన్స్ కరిగించినప్పుడు దాని సర్పేస్ విలువ అధికంగా ఉండడం స్మగ్లర్లకు కలిసొచ్చింది. కప్రో-నికెల్‌తో తయారు అయ్యే ఈ ఐదు రూపాయల కాయిన్ బరువు సుమారు 9 గ్రాములు ఉంటుంది. ఆ సీరీస్ నాణేల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank Of India) ఇప్పుడు నిలిపివేసింది. కేవలం కొత్త కాయిన్స్ మాత్రమే ముద్రణ చేస్తోంది పాత కాయిన్స్ ని బంగ్లాదేశ్‌కి స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన వాటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ లో ఈ కాయిన్స్ తో కోట్లలో వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తించిన ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వీటితో ఏం చేస్తున్నారో తెలుసుకుంటే మనం విస్తుపోవాల్సిందే. వీటిని బంగ్లాదేశ్‌కు తరలించిన వాటిని కరిగించి ఆ ఖనిజాన్ని బ్లేడ్ల తయారీకి వినియోగిస్తున్నట్లు సమాచారం. ఒక్క నాణెంతో వచ్చిన ముడి సరుకు ద్వారా దాదాపు గా ఆరు బ్లేడ్లు తయారు చేయొచ్చట. మార్కెట్ రేట్ ప్రకారం ఒక్క బ్లేడ్ రెండు రూపాయల నుంచి బ్రాండ్ బట్టి రేటు మారే అవకాశం ఉంది. ఈ మాఫియా ముఠా గుట్టు తెలుసుకున్న రిజర్వ్ బ్యాంకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే తొలిదశ లో ఐదు రూపాయల నాణేల తయారీకి వాడే మెటల్స్‌ని మార్చాలని నిర్ణయించి పాత కాయిన్స్‌తో పోలిస్తే సన్నగా ఉండేలా కొత్త రకం నాణేలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త నాణాలను మార్కెట్లో తక్కువ ధరకే లభించే మెటల్స్‌తో తయారు చేయడం వలన కొత్త కాయిన్స్‌ను స్మగ్లింగ్ చేసే అవకాశం తక్కువ ఈ మెటల్ బ్లేడ్లు తయారికి ఉపయోగపడకపోవడమే ఇందుకు కారణం.