ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ చెప్పి మరి ఈ ఏడాది మే లో జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య జీవిత కథ సినిమా గా రానుంది కన్నడం తో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందనుంది. మాజీ మంత్రి శివరాజ్ తంగదాగి మరి కొంతమంది ఔత్సాహక నిర్మాతలతో కలిసి ఏ సినిమాను నిర్మించనున్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని చెప్తున్న నేపథ్యంలో ఈ బయోపిక్ పై అంచనాలు మరింత పెరిగాయి. సిద్దరామయ్య బయోపిక్ ఓ సంచలన విషయమైతే ఇందులో 75 ఏళ్ల ఓల్డ్ పొలిటిషన్ గా విజయసేతుపతి నటిస్తుండడం మరో విశేషం. రాజకీయ ఎత్తుగడలు, వ్యూహ, ప్రతి వ్యూహాలు.. అంచెలంచలుగా ముఖ్యమంత్రి స్థానానికి ఎదిగిన వైనంతో పాటు అందరికీ నచ్చేలా ఒక మంచి ప్రేమ కథ కూడా ఇందులో చెప్పబోతున్నామని చిత్రానికి రచన తో పాటు దర్శకత్వం వహిస్తున్న సత్యరత్న చెప్పారు ‘లీడర్ రామయ్య'(LEADER RAMAIAH) పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్ర పోస్టర్ ను శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు ‘ఏ కింగ్ రైజ్డ్ బై ద పీపుల్’ (A KING RAISED BY THE PEOPLE) అన్న హెడ్లైన్ లాంటి పదునైన వ్యాఖ్య తో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ఎంఎస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమా సిద్ధరామయ్య 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు మూడో తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు సత్యరత్న వెల్లడించారు.movies
previous post