సమస్య లేని ఇల్లు లేదు… ఇబ్బందులు పడని మనిషీ లేడు.. ఈ బిజీ లైఫ్ లో ఎవరి కష్టాలు వారివి.. ఇబ్బందులను ఇన్స్టంట్ గా తీసేయలేకపోయినా నెగెటివ్ ఎనర్జీ ని తీసేసే శక్తి మాత్రం మన చేతిలో ఉంది.. అన్నీ బావుంటాయి.. కానీ ఎక్కడికెళ్లినా ఏదో ఒక సమస్య… పనులు ముందుకు నడవవు..ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది ఒకదానికొకటి వస్తూనే ఉంటాయి.. వాటి నుంచి ఎంత బయట పడదామన్నా వీలుకాదు.. ఎంత వెతికిన పరిష్కారం దొరకదు.. అప్పుడేం చెయ్యాలి మనఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ని పారదోలితే సమస్యలన్నీ ఇట్టే ఓ కొలిక్కి వస్తాయి.. మనముండే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది అన్న డౌట్ కూడా మనకి రావచ్చు.. అప్పుడప్పుడు వచ్చే అతిథులు, స్నేహితులు, కొంతమంది దిష్టి కళ్ళు.. పాతబడ్డ వస్తువులు.. మనం తొక్కి వచ్చిన నిషిద్దాలు.. ఇలా ఒకటి కాదు ఎన్నో నెగెటివ్ ఎనర్జీ కారకాలు… ఈ క్రమంలో నెగెటివ్ ఎనర్జీ ని కొన్ని రకాల వాస్తు దోషగుణాలను పోగొట్టేందుకు ఎన్నో గ్రంధాలు మనకి కొన్ని పరిష్కార మార్గాలను సూచించాయి.. ఆవేమిటంటే వేప ఆకులను ఇంట్లో మండించడం వల్ల వాస్తు దోషం తో పాటు నెగెటివ్ ఎనర్జీ పోతుంది. దాంతో పాటు ఇంట్లో ఉండే బాక్టీరియా, వైరస్‌లు నాశనమవుతాయి. వేప ఆకుల్లో ఉన్న సహజ సిద్ధమైన యాంటీ బయోటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు సూక్ష్మ క్రిముల పట్ల అద్భుతంగా పని చేస్తాయి.. దేవుడికి పూజ చేసినప్పుడు మాత్రమే మనం వెలిగించే అగర్ బత్తీలను మామూలు సమయంలో కూడా వెలిగించడం వలన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ మాయమవుతుంది. అయితే అగర్‌బత్తీలను ఎప్పుడు వెలిగించినా బేసి సంఖ్యలో మాత్రమే వెలిగించాలి. మరో రెమెడీ ఏంటంటే ఇంట్లో ఉన్న ఫర్నిచర్‌ను అప్పుడప్పుడు తీసి వేరే దిశలో పెట్టి మళ్లీ యథావిధిగా అమర్చుకోవడం వలన కూడా నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. దీని గురించి ఫెంగ్ షుయ్ వాస్తులో కూడా ప్రస్తావించారు. అలాగే రెండు చిన్నపాటి గిన్నెలను తీసుకుని వాటిలో కొంత ఉప్పు వేయాలి. అనంతరం ఆ రెండు గిన్నెలను ఈశాన్య, నైరుతి దిశల్లో పెడితే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే విధంగా కిటికీలను ఎల్లప్పుడూ తెరచి ఉంచాలి. వాటి వద్ద కుండీల్లో ఏవైనా మొక్కలను ఉంచాలి. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ బయటికి వెళ్లి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉదయం, సాయంత్రం వేళ్లలో కొద్దిగా కర్పూరం తీసుకుని వెలిగించి దాంట్లో కొన్ని లవంగాలను వేసి మండించడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తుదోషం తో మనల్ని ఇబ్బంది పెడుతున్న నెగెటివ్ అంతా పోయి అదృష్టం కలసివచ్చి ఆర్థిక సమస్యలు సమసిపోతాయి.. ఇంకా తెల్ల ఆవాలు, గుగ్గుళ్లను కలిపి ఇంట్లో రోజూ మండిస్తున్నట్టయితే నెగెటివ్ ఎనర్జీ మాయమవుతుంది. అంతే కాకుండా ఇంట్లో అష్ట దిక్కుల్లో తెల్ల ఆవాలను చల్లిన ప్రయోజనం ఉంటుంది.. అలాగే వారానికి ఓ సారైనా ఇంట్లో సాంబ్రాణి పొగ వేసిన లేకపోతే గుగ్గిలం స్టిక్స్ ని మండించినా ఇంట్లో సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కలుగి నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇందులో ఏవైనా మన వీలుని బట్టి చేసుకుని నెగెటివ్ ఎనర్జీ నుంచి బయట పడొచ్చు..
previous post
next post