పోస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నిషేదానికి ఎన్నికల కమీషన్ విధించిన జూన్ 1 గడువు మరికొన్ని గంటల్లో తీరిపోనుండడం తో సర్వే , మీడియా సంస్థలు వ్యయప్రయాసలకోర్చి నిర్వహించిన సర్వే లని ప్రకటించనున్నాయి.. ఇప్పటికే చాలా సంస్థలు, ఇండివిడ్యువల్ గా సర్వేలు చేసిన వ్యక్తులు ఇప్పటికే విశ్లేషణలు పేరిట బయట పెట్టేసారు.. ఈ సారి ఎన్నికల్లో దేశం అంతా ఒకెత్తు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఒకెత్తు అన్న తరహా గా ఉంది.. దాదాపు ఎనిమిది శాతం సర్వే సంస్థలు ఒక వైపే మొగ్గు చూపితే కేవలం రెండు శాతం మరో వైపు మొగ్గు చూపాయి.. జూన్ 4 కౌంటింగ్ కు ముందు వెలువడనున్న పోస్ట్ పోల్ ఎగ్జిట్ ఫలితాలు తమకు అనుకూలంగా ఇవ్వాలని ఆయా సర్వే లను వైసీపీ సర్వే మేనేజ్మెంట్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. తామే అధికారం లోకి వస్తున్నట్లుగా వైసీపీ అనుకూల సర్వేలు ఇచ్చేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలకు పెద్ద మొత్తం లో డబ్బు చెల్లించారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. పోలింగ్ లో గెలిచినా గెలవకపోయినా ఎగ్జిట్ పోల్స్ లో తప్పక గెలవాలన్నపట్టుదలతో ఆ నేతలు ఉన్నారని అంటున్నారు.. ఎగ్జిట్ పోల్స్ లో గెలిస్తే ఉపయోగం ఏంటని వేస్తున్న ప్రశ్నలకు కొంతమంది నుంచి వస్తున్న సమాధానం మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది. ఒకవేళ తాము గెలిస్తే ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అయ్యాయని ఇన్ కేస్ కూటమి గెలిస్తే పోల్ మేనేజ్మెంట్ జరిగింది అని అరిపించవచ్చన్నది వీళ్ల ప్లాన్ అట.. బాబోయ్ ఎం మాస్టర్ ప్లాన్ రా బాబు అని తలలు పట్టుకుంటున్నారు కూటమి నేతలు..
previous post