Vaisaakhi – Pakka Infotainment

కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్

వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల అధికారులను CEO ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు.స్ట్రాంగ్ రూమ్ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు EVMలను తరలించడానికి ఒకవైపు, అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు.ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్తో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. ఇప్పటికే ఊరేగింపులు, ప్రదర్శనలు, బాణసంచా అమ్మకాలపై ఈసీ నిషేధం విధించింది.. ఫలితాల ప్రకటన రోజున అరాచక శక్తులు విధ్వంసానికి దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే సూచించడం తో ఈసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More