ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
మాస్ సాంగ్ అఫ్ ది ఇయర్ స్టెప్పా మార్ తో ప్రారంభించిన ప్రమోషన్లతో ఎప్పటికప్పుడు అప్డేట్లను అందజేస్తూ పబ్లీసిటీ దూకుడు పెంచారు. ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మిస్తుండగా సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. శామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫర్స్ కాగా, మణి శర్మ మ్యూజిక్ అందించారు.