తీర ప్రాంతాల ఫ్యాక్టరీ కాలుష్యం మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలిగిస్తోంది.ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్ధాలు నేరుగా సముద్ర జలాలలోకి వెళ్లడంతో సముద్ర నీరు కలుషితమమై వివిధ రకాల మత్య సంపద మృత్యువాత పడుతున్నాయి. తాజాగా అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం తంతడి పంచాయతీ శివారు వాడపాలెం సముద్ర తీర ప్రాంతంలో ఓ డాల్ఫిన్ మృతి చెందింది. కొనఊపిరితో తీరానికి కొట్టుకువచ్చిన భారీ డాల్ఫిన్ ను కొవిరి గోవిందరావు, వంక ప్రశాంత్ అనే ఇద్దరు మత్స్యకార యువకులు తిరిగి సముద్రంలోకి నెట్టినప్పటికీ చనిపోయింది. కొనఊపిరితో ఉన్న డాల్ఫిన్ ను అతి కష్టం మీద సముద్రంలోకి నెట్టారు. అయినా ఫలితం లేకపోయింది మత్స్యకారులు డాల్ఫిన్ ను తినరు. అందుకే వలలకు చిక్కినా తిరిగి సముద్రంలోనే వదిలేస్తారు. లోతైన సముద్రంలో తప్ప తీరంలో ఈ డాల్ఫిన్లు కనబడవు. అయితే చుట్టుపక్కల ఉన్న కర్మాగారాల నుంచి వ్యర్థజలాలు సముద్రంలో కలవడంతో నీరు కలుషితమై అరుదైన జీవరాశి ఒడ్డుకు చేరి విపత్కర స్థితిలో మృత్యువాత పడుతోందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.