థియేటర్స్‌లో ప్రేక్షకులను మెప్పించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ‘డీమాంటే కాలనీ 2’ చిత్రం సెప్టెంబర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఈ చిత్రం లో. అరుల్‌నిధి, ప్రియా భవానీ శంకర్ అద్భుతమైన నటనతో సీట్ ఎడ్జ్‌లో ప్రేక్షకులను కూర్చోపెట్టారు. తమిళ్ సినీ హిస్టరీలో ఫ్రాంచైజీగా రూపొందిన ‘డీమాంటే కాలనీ2’ రూ.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఘన విజయం సాధించిన ‘డీమాంటే కాలనీ’కి కొనసాగింపుగా రూపొందిన ‘డీమాంటే కాలనీ 2’.. ముందు చిత్రాన్ని మించేలా ఆసక్తికరమైన హారర్, థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కింది. అంతే కాకుండా తొలి భాగం కంటే కూడా భయానకమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ‘డీమాంటే కాలనీ 2’ తెరకెక్కింది. ఈ సందర్భంగా
జీ 5 (ZEE5) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ ‘‘సౌత్ ఇండియన్ కంటెంట్‌కు ZEE5లో మంచి ఆదరణ వుందని ఈ క్రమంలో ‘డీమాంటే కాలనీ 2’ వంటి హారర్ మూవీని ప్రపంచ వ్యాప్త ప్రేక్షకులకు అందిస్తున్నాం. తొలి భాగాన్ని మించిన వైవిధ్యమైన అంశాలతో, హారర్ ఎలిమెంట్స్‌తో సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని తప్పకుండా ప్రేక్షకులను ఈ చిత్రం మెప్పిస్తుందనే నమ్మకం ఉందన్నారు.
చిత్ర దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ ‘‘థియేటర్స్‌లో ఘన విజయం సాధించిన ‘డీమాంటే కాలనీ 2’.. ఇప్పుడు జీ 5 ద్వారా మరింత మంది ప్రేక్షకులకు అందుబాటులోకి రావటం ఆనందాన్నిచ్చే విషయం. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఈ అద్భుతమైన స్పందన గొప్పగా అనిపించింది. ఇప్పుడు జీ5 వంటి మాధ్యమం ద్వారా ఈ చిత్రం అలరించనుంది. మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు సినిమా రీచ్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాం. ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని సినిమాను ఎంజాయ్ చేయవచ్చు’’ అన్నారు.
నటుడు అరుల్‌నిధి మాట్లాడుతూ ‘‘‘డీమాంటే కాలనీ 2’ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవటం ఆనందాన్నిచ్చే విషయం. ఈ చిత్రంలో డబుల్ రోల్ చేశాను. శ్రీని అనే క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఉండే రఘు అనే పాత్రలో నటించాను. నా పాత్ర, నా పెర్ఫామెన్స్ పట్ల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. జీ 5 ద్వారా మరింత మంది ప్రేక్షకులకు రీచ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నాను’’ అన్నారు.
.