మార్వెల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అయితే చాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాల్లో కనిపించే సూపర్ హీరోల అభిమానలకి సంబరాల్లో మునిగితేలుతుంటారు. మార్వెల్ యూనీవర్స్ నుంచి డెడ్ పుల్ సిరీస్ లో భాగంగా జూలై 26న డెడ్ పుల్ & వాల్వరిన్ మూవీ రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ యూట్యూబ్ లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. ఈసారి డెడ్ పుల్ తో పాటు వాల్వరిన్ కూడా వెండితెర పై అద్భుత విన్యాసాలు చేయబోతున్నాడు. ఇద్దరు సూపర్ హీరోలు ఒకేసారి అభిమానులు ముందుకు రానున్న నేపథ్యంలో డెడ్ పుల్ అండ్ వాల్వరిన్ మోస్ట్ ఫెవరేట్ మార్వెల్ మూవీగా రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రీత్య హైదరబాద్ లో మార్వెల్ మూవీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే డెడ్ పుల్ & వాల్వరిన్ టికెట్లు బుకింగ్ మొదలైన సందర్భంగా తమ అభిమానాన్ని పెద్ద ఎత్తున సంబరాలు చేస్తూ చాటుకున్నారు. ఈ సెలబ్రేషన్ వీడియోలు ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్నాయి. డెడ్ పుల్ & వాల్వరిన్ లో ప్రధానపాత్రధారులుగా రయన్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ నటిస్తున్నారు. జూలై 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో డెడ్ పుల్ & వాల్వరిన్ విడుదలవ్వనుంది.