తమ కంపెనీ ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవీ షీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ కు కారణమవుతుందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా కంపెనీ తోలిసారిగా అంగీకరించింది. కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో, రక్తం గడ్డకట్టడానికి మరియు తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్‌కు దారితీసే పరిస్థితికి కారణమవుతుందని వ్యాక్సిన్ తయారీ దారైన ఆస్ట్రాజెనెకా కోర్టు కు పత్రాలు సమర్పించింది.మహమ్మారి సమయంలో ఆస్ట్రాజెనెకా మరియు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే ఉత్పత్తి చేయబడింది.. టీకా ప్రభావం వలన మరణాలు మరియు తీవ్ర గాయాలకు కారణమైందని యూ కె హైకోర్టులో దాదాపు 51 కేసుల్లో బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని కోరుతున్నారు.వ్యాక్సిన్ వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యాయని యూకేలో పలువురు కోర్టుమెట్లెక్కారు రక్తం గడ్డకట్టడంతో పాటు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు. ‘అరుదైన సందర్భాల్లో ఇలా జరగొచ్చు’ అని ఆస్ట్రాజెనెకా కోర్టుకు తెలిపింది. ఈ కంపెనీ ‘కొవిషీల్డ్’ పేరుతో ఇండియాలో వ్యాక్సిన్లు విక్రయించింది.అయితే అరుదైన సందర్భాల్లోనే ఇలా జరుగుతుందని కనుక భారతీయులు కంగారుపడనవసరం లేదని వైద్యులు చెపుతున్నారు.ఇంకా రక్త ప్రసరణ లో ఇబ్బంది బాగా అనిపించినప్పుడు డి డైమర్ టెస్ట్ వైద్యుల సూచన మేరకు రక్తం నాలాలులో రక్తం గడ్డలు శాతాన్ని తెలుసుకోవచ్చు.
previous post