సింగపూర్‌లో భారీగా కేసులుమరోసారి మహామ్మారి కరోనా కలకలం సృష్టిస్తోంది. సింగపూర్‌లో ఈ నెల 5 నుంచి 11 వరకు 25,900 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా మాస్కులు ధరించాలని సింగపూర్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం వేవ్ ప్రారంభ దశలో ఉందని.. రానున్న 2-4 వారాల్లో భారీగా కేసులు నమోదవుతాయని అంచనా వేస్తోంది. రోజుకు 250 మంది ఆస్పత్రుల్లో చేరుతుండగా.. 60 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు అదనపు డోస్ టీకా తీసుకోవాలని 2-4 వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ చెప్తున్నారు.. మే 5 నుండి కేవలం ఆరు రోజుల్లోనే 25,900 కంటే ఎక్కువ కేసులను నమోదు చేయడంతో సింగపూర్ కొత్త కోవిడ్ -19 వేవ్‌ను చూస్తోంది, ప్రస్తుతం వేవ్ ప్రారంభ భాగంలో ఉన్నామని అది క్రమంగా పెరుగే అవకాశం కనిపిస్తోందని ఓంగ్ చెప్పారు. ఇదిలా ఉండగా ఇండియా(మహారాష్ట్ర) లో కూడా కొన్ని కేసులు నమోదయినట్టు సమాచారం