దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నప్పటికి అందరి దృష్టి మాత్రం ఆంధ్రప్రదేశ్(ANDHRAPRADESH) ఎన్నికలపైనే ఉంది ప్రజలు మరొక ఛాన్స్ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా..?ఈ ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు గట్టిస్తాయా…? లేక కూటమికి అధికారాన్ని అప్పగిస్తారా చంద్రబాబు నాయుడు(CHANDRABABU) మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా అన్న విషయంలోనే అందరిలోనూ ఎడతెగిన ఉత్కంఠ నెలకొంది. టిడిపి(TDP) జనసేన(JANASENA) బిజెపి(BJP)తో కూడిన కూటమితో అధికార వైసిపి(YCP) అన్ని సీట్లతో ముఖాముఖి తలపడి నువ్వా నేనా అన్న రీతిలో పోరు సాగుతున్న టైంలో ఓ సర్వే సంస్థ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది రాష్ట్రంలోనే విలక్షణ నియోజకవర్గంగా పేరుపొందిన ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందన్న విషయం కాంగ్రెస్ శ్రేణుల్ని కాదు విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పూర్తిగాకుదేలయిన కాంగ్రెస్ పార్టీ వైయస్ షర్మిల(YS SHARMILA) పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న మాట వాస్తవమే అయినా సీట్లు గెలుచుకునే స్థాయి అయితే కాదు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఈ సర్వే పలుకు ఆ పార్టీ నేతలనే విస్మయానికి గురిచేసింది.. గెలుపు ముంగిట ఎడ్జ్ లో ఉన్న ఆ నియోజకవర్గ ఏంటన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో పెరిగింది బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మినీ ముంబాయి గా పేరుపొందిన చీరాలలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వివిధ సర్వేల్లో ముందుంది అన్నమాట ఇప్పుడు గొప్పగా వినపడుతోంది. తొలిదశ నుంచి కాంగ్రెస్ వాది అయిన ఆమంచి కృష్ణమోహన్ మళ్ళీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆయనకు మెజార్టీ ఓటర్లు పట్టం కట్టే అవకాశం ఉన్నట్లు బలంగా వినపడుతోంది. 2014 విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేక ఏర్పడిన నేపథ్యంలో అప్పటివరకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడుగా ఉన్న ఆమంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి పోతుల సునీత (తెలుగుదేశం) పై 10,335 కోట్ల మెజారిటీతో 37.30% ఓట్లతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో వైసిపి మూడో స్థానానికి పరిమితమైంది 2019కి వచ్చేసరికి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ నుంచి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన కరణం బలరామకృష్ణమూర్తి 17వేల పై చిలుకు ఓట్లతో 53.27% ఓట్లతో ఘనవిజయం సాధించారు తదనంతర పరిస్థితులలో ఆయన మళ్ళి వైసిపి కి మద్దతు పలికి ఆ పార్టీ వైపే నిలిచారు అత్యంత ఆసక్తికరంగా మారిన ఈ 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున కరణం బలరామకృష్ణమూర్తి తనయుడు కరణం వెంకటేష్ పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఎం కొండయ్య యాదవ్ పోటీకి దిగారు ఇప్పుడే కాస్త జవసత్వాలు పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ తరపున ఆమంచి కృష్ణమోహన్ రంగం లోకి దిగి పోటీని రసవత్తరం గా మార్చారు. ఈ నేపథ్యంలో ఓటరు నాడి ని తెలుసుకునేందుకు ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఆమంచి కృష్ణమోహన్ కి 35.10% ఓటర్ల మద్దతు పలికి ముందంజలో ఉండటమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రెండో స్థానంలో వైసీపీకి 33.61 శాతం మంది ఓటర్లు జై కొట్టగా తెలుగుదేశం పార్టీకి కేవలం 27.19 శాతం మంది మాత్రమే మద్దతు పలికి మూడవ స్థానంలో నిలబెట్టబోతున్నారని ఆ సర్వే స్పష్టం చేసింది. ఎన్నిలక వరకు ఇదే ఒరవడి కొనసాగితే ఉనికికోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కి ఇదొక బంపర్ ఆఫర్ అనే చెప్పొచ్చు.. అయితే ఆమంచి గెలిచిన తరువాత కూడా కాంగ్రెస్ లోనే కొనసాగుతారా.? అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోకి జంప్ అవుతారా..? అన్న మేటర్ లోను ఓటర్లు రకరకాల విశ్లేషణలు చేసేస్తున్నారు.
previous post