తెలంగాణ లో బీఆరెస్ కోటలను పగలగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికలలో ఆ స్థాయి లో ఫలితాలు లేకపోవడంతో ఇప్పుడు దానిపై అంతర్గత విశ్లేషణలు ప్రారంభించింది.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో అధిష్టానం గడచిన ఎన్నికల ఫలితాలపై ఫోకస్ పెట్టింది.. బీజేపీ అన్ని స్థానాలు గెలవడం పై ఆరా తీస్తోంది.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో 39శాతానికి పైగా ఓట్లతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్2024 పార్లమెంట్ ఎన్నికల్లో 40పర్శంటేజ్ కు పైగా ఓట్ల శాతాన్ని పెంచుకున్నప్పటికి ఎనిమిది ఎంపీ సీట్లకే పరిమితమైంది.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఎంపీ సీట్ల కు వచ్చేసరికి 8స్థానాలు గెలుచుకోవడం కాంగ్రెస్ వర్గాలకు షాక్ ఇచ్చింది.. ఒక్క సీటు ని కూడా గెలుచుకుని బీఆరెస్ పార్టీ శ్రేణులు అన్ని చోట్లా బీజేపీ బేషరతుగా సహకరించడం వల్లే బీజేపీ కి ఆ గెలుపు సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు.. ఎన్డీఏ కు ఈ సారి ఇండీ కూటమి గట్టిపోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది.. ఎంపీ సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయో తేల్చండి అంటూ ఆయా రాష్ట్రాల చీఫ్ లకు హుకుం జారీ చేసింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తూనే చికిత్స మొదలుపెట్టింది.
సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎంపీ సీటు సహా రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ సీటు మల్కాజ్ గిరి సీటును కోల్పోవడం పై పోస్టుమార్టం మొదలుపెట్టింది.. రేవంత్ రెడ్డి పనితీరు కి ఇది పెద్ద గీటురాయి కాకపోయినా సీనియర్ల విసుర్లు నుంచి రేవంత్ రెడ్డి కి కొద్దిగా ఇబ్బంది కర పరిస్థితి ఇది. కాంగ్రెస్ పార్టీకి తక్కువ సీట్లు రావడానికి గల కారణాలు తెలుసుకోడానికి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసిన ఏఐసీసీ త్వరలోనే క్షేత్ర స్థాయిలో పర్యటించి అసలు కారణాలను అన్వేషించనుంది.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా కాంగ్రెస్ విజయ బావుటా ఎగరేసేల చర్యలు చేపట్టనుంది. త్వరలో టీపీసీసీ కి కొత్త అధ్యక్షులు రాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.
previous post
next post