రాజకీయాలపై చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్పందించారు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి తన మద్దతు ప్రకటించారు. ఇప్పటికే జనసేన పార్టీ కి భారీ విరాళం ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ పార్టీ ఉన్న కూటమికి తన మద్దతు ప్రకటించారు..పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ కూటమిగా ఏర్పడటం చాలా సంతోషంగా ఉంది అన్నారుఅలాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బిజెపి నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ పెందుర్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్ ను గెలిపించాలని చిరంజీవి కోరారుఇద్దరు చాలా సమర్థవంతులు మంచివారు అన్నారుఏపీ అభివృద్ధికి ముందుకు వెళ్లాలని అందుకోసం ప్రజలందరూ నడుంబిగించాలని కోరారు.. అయితే ఇది ట్వీట్ ద్వారా దృవీకరించలేదు.. టీడీపీ, జనసేన, బీజేపీ కి మద్దతు గా ప్రత్యక్ష ప్రచారం చేస్తారా.. లేదా అన్నది కూడా స్పష్టత లేదు..