ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వారికి అండగా నిలబడుతూ తనదైన స్పందనను తెలియజేసే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ మద్ధతుని తెలియజేసిన సంగతి తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి వయనాడ్ బాధితుల కోసం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘వయనాడ్ జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో నా గుండె తరుక్కుపోతుంది. బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా సానుభూతిని ప్రకటించారు.