ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 1990 నుంచే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ బలంగా ఉంది.. 2000 తర్వాత కాపు సామాజిక వర్గం నుంచి సీఎం అభ్యర్థిగా చాలా మంది పేర్లు బయటకు వచ్చినప్పటికి అదే సమయంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ,కాంగ్రెస్ పార్టీలు చాలా బలంగా ఉండడం అక్కడ వేరే సామాజిక వర్గ నాయకులు స్ట్రాంగ్ గా ఉండడం జరిగింది. మరొ పక్క కాపు ఉద్యమం కూడా బలంగానే కొనసాగింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో నంబర్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ప్రజల ముందుకు రావడం ఆయన సభలకు, సమావేశాలకు లక్షలాదిగా జనం తరలి రావడం చూసిన తర్వాత కచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ అధికారంలోకి వచ్చి చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అంతా ఊహించారు.. కానీ ఊహించిన స్థాయిలో మెజార్టీ సీట్లు రాకపోవడంతో చల్లబడాల్సిన పరిస్థితి వచ్చింది.. ఆ క్రమంలోనే ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కేంద్ర మంత్రి పదవి స్వీకరించడం జరిగాయి.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఉద్యమం గట్టిగా కొనసాగుతున్న సమయంలో అప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వరుసగా ముఖ్యమంత్రులను మార్చడం జరిగింది. ఆ సమయంలో చిరంజీవికి ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చి చేజారి కాంగ్రెస్ సీనియర్ నేత కొణీజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఊహించని విధంగా ముఖ్య మంత్రులు అయ్యారు. అయితే రోశయ్యను ముఖ్యమంత్రిగా చేసే సమయంలో మొదటిగా చిరంజీవి పేరు ప్రస్తావనకు వచ్చింది. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా చిరంజీవి పేరును పరిశీలనలోకి తీసుకుంది. అప్పుడు తెలంగాణ ఉద్యమం జోరు కొనసాగుతున్న సమయంలో అనుభవజ్ఞుడైన నేత ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్ర నాయకత్వం నుంచి ప్రతిపాదనలు వెళ్లడంతో తప్పనిసరి కొణిజేటి రోశయ్యను కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ముఖ్యమంత్రిగా చేసింది. ఆ తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే సమయంలో కూడా చిరంజీవి పేరు ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు కూడా అదే పాట పార్టీ సీనియర్లకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం డిమాండ్ చేయడంతో కేంద్రం తలొగ్గక తప్పాల్సి వచ్చింది. దీంతో రెండోసారి కూడా చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ మిస్సయింది. ఇటీవల విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఆ సమయంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని పార్టీలో కొంతమంది నాయకులు ప్రయత్నించారని , ఆ ప్రయత్నంలో చిరంజీవి పేరు కూడా ప్రస్థానకు వచ్చిందని అన్నారు. కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లు ముఖ్య మంత్రులు అయిన సమయంలో చిరంజీవిని సీఎం చేయాలనే డిమాండ్ బలంగా ఉందన్నారు. కానీ కొందరు సీనియర్ల నిర్ణయాల వల్ల ఆ అవకాశం చిరంజీవి కి దక్కకుండా పోయింది.. చిరంజీవిని సీఎంని చేసి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడి ఉండేదని ఆరోజు జరిగింది తప్పిదమేనని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు చిరంజీవి జోరును చూసి టిడిపి ,కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుంది. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కోట్లలో ఉన్న చిరంజీవి అభిమానులు అభిమానం ఓటుగా మారలేకపోయింది. దీంతో కొద్ది సీట్ల తోనే చిరంజీవి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన సినిమాల పైనే దృష్టి పెట్టారు. జనసేన పార్టీతో ముందుకు వచ్చిన చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాపు సామాజిక వర్గాల నుంచి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ కు మాత్రమే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
previous post
next post