చైనా దాష్టికాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.. అగ్రరాజ్యం గా అవతరించాలన్న కాంక్ష ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరికతో అడ్డూ అదుపు లేని అకృత్యాలకు తెర తీస్తోంది.. అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు పేర్ల ను మార్చడం తో మళ్ళీ వార్తల్లోకి వచ్చిన చైనా తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని అదృశ్యం చెయ్యడం లో కూడా అందెవేసిన చెయ్యే. టిబెట్‌కు చెందిన గెధున్ చోకీ నియిమా పంచెన్ లామ దగ్గర నుంచి కనిపించకుండాపోయిన ప్రపంచ ప్రముఖులు ఎందరో వున్నారు కోటీశ్వరులు కనిపించకుండా పోవడం అనే అంశం మరో ఆసక్తి రేపే విషయం. చైనాకు చెందిన టెక్నాలజీ డీల్ మేకర్ బావో ఫ్యాన్, కొన్నాళ్ల క్రితం అదృశ్యం కావడంతో ఈ విషయం మరోసారి చర్చల్లోకి వచ్చింది.చైనా టెక్ రంగంలో ప్రముఖుడిగా పరిగణించే ‘‘చైనా రనెసాన్స్ హోల్డింగ్స్’’ అనే ప్రైవేటు బ్యాంకింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు బావో ఫ్యాన్ కొన్ని రోజుల నుంచి ఆయన కనిపించకుండా పోయారు. పీపుల్స్ రిపబ్లిక్ చైనాలో ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు నిర్వహిస్తున్న దర్యాప్తుకు బావో సహకరిస్తున్నారని ఆయన కంపెనీ ప్రకటించడానికి ముందే అదృశ్యం కావడం కలకలం రేపింది. ప్రభుత్వానికి చెందిన ఏ సంస్థ ఈ విచారణను నిర్వహిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అలీబాబా గ్రూపు అధినేత ‘జాక్ మా’తో సహా ఇటీవల సంవత్సరాలలో పలువురు చైనా పారిశ్రామిక వేత్తలు కనిపించకుండా పోయారు. ఇప్పుడు బావో అదృశ్యం కూడా మిస్టరీగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, మానవ హక్కుల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సాధారణ పౌరులు కూడా చైనాలో కనిపించకుండా పోతున్నారు. అయితే, ఇలాంటి కేసులకు బిలియనీర్ల అదృశ్యానికి దక్కినంత ప్రచారం లభించకపోవడం తో సాధారణ పౌరుల మిస్సింగ్ కేసులు వెలుగులోకి రావడం లేదు..
previous post
next post