విభజిత ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు అదేరోజు రాత్రి శ్రీవారి దర్శనానికి తిరుమల వెళ్లనున్నారు. ఆ రోజు అక్కడ బస చేసి మరుసటి రోజు శ్రీవారిని దర్శించుకోనున్నారు.. గత ప్రభుత్వం లో తిరుమల వైభవాన్ని దెబ్బతీసారన్న విమర్శలపై అక్కడి నుంచే ముఖ్యమంత్రి ప్రక్షాళన ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ఆరంభించిన నిత్యాన్నదానం లో భక్తులు అన్నాన్ని ఇంత వరకు ప్రసాదం గానే భావించారే తప్పా ఏ రోజు విమర్శలు చెయ్యలేదు.. కానీ వైసీపీ ప్రభుత్వహయాంలో వెంగమాంబ సత్రం లో నిరసనలు చేసిన సందర్భాలు ఉన్నాయి.శ్రీవారి సేవా టికెట్ల మీద శ్రీవాణి టికెట్ల మీద శ్రీవారి డిపాజిట్ల మీద కమిషన్లకు కక్కుర్తి పడి ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన కోట్లాది రూపాయలపై కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి.. కరోనా టైం లో భక్తులను అనుమతించిన అనంతరం కనీసం శానిటైజర్ కూడా పెట్టని పరిస్థితి పై భక్తులు దుమ్మెత్తి పోశారు.. ఇక్కడ పనిచేసిన అధికారులు పార్టీ పెద్దల అడుగులకు మడుగుల్లోత్తి.. పనిచేసి ఆలయ ప్రతిష్ట ను మంట గల్పిన విషయంలో భక్తులు అనేకసార్లు రిపోర్ట్ చేశారు.
ఇక్కడ ఎన్నో ఏళ్ల నుండి పాతుకు పోయిన ధర్మారెడ్డి లాంటి అధికారులపై టీడీపీ, బీజేపీ నాయకులు ఎన్నాళ్లనుంచో పోరాటం చేస్తున్నారు. ధర్మారెడ్డి సెలవు పై వెళ్లాలనుకున్న ప్రయత్నాన్ని ఆ నేతలు విమర్శిస్తున్నారు.శ్రీవెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తప్పించుకోవాలి విదేశాలకు పారిపోవాలని చేసిన ప్రయత్నాలు ఫలించవని శ్రీవారి సొమ్ము రికవరీ కాకుండా వేంకటేశ్వర స్వామి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరని అంటున్నారు.ఆయితే ధర్మారెడ్డి కి కేవలం 7 రోజులు అనుమతి ఇచ్చి ఏపీ దాటి వెళ్లొద్దు అనడం పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి ఆయన మొహం కూడా చూడడం ఇష్టం లేకే పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. శ్రీవారి సొమ్మును మంచినీళ్ళ లాగా జగన్ మోహన్ రెడ్డి నా జేబులో ఉన్నాడన్న అహంకారంతో అధికార బలంతో డబ్బు మదంతో శ్రీ వారి ఆలయ పవిత్రతను మంట కలిపిన నాయకులను, అధికారులు ఎవ్వరిని ఉపేక్షించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.నూతన ప్రభుత్వం ఏర్పడడం తో మసక బారిన తిరుమల వైభవం మళ్లీ గాడిలో పడుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..