Vaisaakhi – Pakka Infotainment

ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ పై గవర్నర్ కు చంద్రబాబు కంప్లైంట్

ఈ నెల 17నుంచి 25 వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ కి లేఖ రాశారు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదని పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందని ఆ లేఖ లో పేర్కొన్నారు.ప్రభుత్వం షెడ్యూల్ చేసిన ఈ-ఆఫీస్ వెర్షన్ అప్ గ్రేడ్ వల్ల సీఎంవో, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ విభాగాల సేవలకు సంబంధించి ఈ ఆఫీస్ ఈ నెల 17 నుండి 25 వరకు అందుబాటులో ఉండవని ప్రభుత్వ ప్రకటన పై.. అత్యవసరంగా ఇప్పుడు చేపట్టిన ఈ విధానంపై అధికారులు, రాజకీయ పార్టీలో అనుమానాలు ఉన్నాయని గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన జీవోలను కూడా ప్రభుత్వం వెబ్ సైట్ లో పెట్టడకుండా రహస్యంగా ఉంచుతోందని వివరించారు. అడ్డగోలుగా విడుదల చేసిన జీవోలను, ప్రభుత్వ పారదర్శకతను ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడి చేసిందనిఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఈ-ఆఫీస్ వెర్షన్‌ మార్పు కోసం నిర్ణయం తీసుకోవడం సరికాదని ఆ లేఖ లో పేర్కొన్నారురాష్ట్రంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేదాకా ఈ ప్రక్రియ ను నిలిపివేయాలని సీఎస్ ను ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేసారుఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమైనట్లు తెలిసిందని కొద్దిరోజుల క్రితం నిబంధనలకు విరుద్ధంగా పలు రికార్డులను సీఐడీ కూడా అనుమతి లేకుండా కాల్చేసిందని ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అన్ని ఫైల్‌లు, నోట్ ఫైల్‌లు, రికార్డ్‌లు మాయంకాకుండా భద్రపరచాలని కోరుతూ అన్ని హెచ్ఓడీలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఇప్పటికే సిసి కెమెరాలు ఉన్న చోట పరిశీలన జరపాలి.• 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉన్న ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ అబ్ధుల్ నజీర్ కి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More