ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి తిరుగు లేని విజయం సాధించడం తో.. చంద్రబాబు ప్రమాణ స్వీకారంపై చర్చ ప్రారంభ మైంది. ఫలితాలకు ముందు ఈ నెల 9న అమరావతిలో ప్రమాణ స్వీకారం ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే రోజున రాజధాని అమరావతిలో చంద్రబాబు ప్రమాణస్వీకా రం ఉంటుందని టీడీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి ప్రధాని నరేంద్రమోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.. కేంద్రంలో ఎన్ డీ ఏ కు బొటాబొటి సీట్లతో అధికారం కట్టబెట్టడం తో భాగస్వామ్య పక్షాలకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్న నేపద్యంలో దాదాపు 29 సీట్లతో సపోర్ట్ గా నిలబడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు మరింత ప్రాధాన్యత దక్కనుందని విశ్లేషకుల అంచనా.. జాతీయ స్థాయి లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి అల్లంత దూరంలో ఆగిపోవడం తో ఎన్ డీ ఏ లో పార్ట్నర్స్ కి ప్రాముఖ్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. కేంద్రంలో చక్రం తిప్పనున్న చంద్రబాబు నాయుడు కు మరింత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలని అనుకోవడం తో అందుకు అనుగుణంగానే ప్రమాణ స్వీకారానికి రానున్నారని తెలుస్తోంది.. ఈ రోజు ఎన్ డీ ఏ సమావేశానికి వెళ్తున్న చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ఉమ్మడి గా ప్రమాణ స్వీకారానికి కేంద్రపెద్దల్ని ఆహ్వానించనున్నారని కూటమి వర్గాలు చెప్తున్నాయి.వైసీపీ,కూటమి మధ్య హోరాహోరీ పోరు జరుగు తుందని అంతా అనుకు న్నా… ఫలితాలు మాత్రం ఏకపక్షంగానే వచ్చాయి. వైసీపీ ప్రచా రంలో ఎంత ధీటుగా పోటీనిచ్చిందో ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టడంలో చతికిల పడింది. ఎన్డీఏ కూటమి అధ్బుతమైన స్ట్రైక్ రేట్ తో ఘన విజ యం సాధించి చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యి అవకాశం ఉందని కూటమి నేతలు చెప్తున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రమాణానికి రానున్నారని ప్రచారం జరుగుతోంది
previous post
next post