ఆరేళ్ల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. హిందూపురం లోక్ సభ పరిధిలో పర్యటిస్తున్న ఆయన చంద్రబాబు, కలిసి ఒక వేదికపై కనిపించడం ఆరేళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా అమిత్ షాను చంద్రబాబు సత్కరించారు. ధర్మవరం నుంచి కూటమి తరఫున బీజేపీ సత్య కుమార్ కి మద్దతు గా ప్రచారం నిర్వహిస్తూ పవిత్ర హిందూపురానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నానని ‘రాముడు, జఠాయువు కలిసిన పుణ్యభూమి లేపాక్షికి ప్రణామం చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. మొత్తం 400కు పైగా సీట్లు సాధించి ఎన్ డీ ఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం’ అని స్పష్టం చేశారుఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తుపై అమిత్ షా ధర్మవరం సభలో స్పష్టత ఇచ్చారు. ‘ఏపీలో గూండాగిరి అంతానికి, అవినీతి ప్రభుత్వాన్ని దించడానికి, భూమాఫియాను అంతం చేయడానికి, అమరావతిని మళ్లీ రాజధానిగా ఏర్పాటు చేయడానికే కూటమిగా ఏర్పడ్డాం. తిరుమలలో శ్రీవారి పవిత్రతను కాపాడుతామని హామీ ఇచ్చారు.
previous post