Vaisaakhi – Pakka Infotainment

కూచిపూడి నర్తకి , న‌టి సంధ్యారాజుకు రాష్ట్ర‌పతి నుంచి ప్ర‌త్యేక ఆహ్వానం

ప్ర‌ఖ్యాత కూచిపూడి నృత్య‌కారిణి, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న తెలుగు న‌టి సంధ్యారాజుకు అరుదైన గౌర‌వం ద‌క్కింది. భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. 77వ స్వాతంత్ర్య‌దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వనంలో నిర్వ‌హించే ఎట్ హోమ్ సెల‌బ్రేష‌న్స్ కి ఆహ్వానిస్తూ లేఖ అందింది. తొలి చిత్రం నాట్యం సినీమా తో రెండు జాతీయ పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న ఘ‌న‌త సంధ్యారాజుకు సొంతం. త‌మిళనాడు బేస్డ్ వ్యాపార‌వేత్త‌, రామ్‌కో గ్రూప్ ఆఫ్ ఇండ‌స్ట్రీస్ ఛైర్మ‌న్ పి.ఆర్‌.వెంక‌ట్రామ‌రాజా కుమార్తె అయిన సంధ్యారాజు. హైద‌రాబాద్‌లో నిశృంఖ‌ల డ్యాన్స్ అకాడెమీ, నిశృంఖ‌ల ఫిల్మ్ ఫౌండ‌ర్‌గా అనేక కార్య‌క‌లాపాలు నిర్వహిస్తున్నారు. త‌న నృత్య క‌ళ‌తో ప్ర‌పంచ య‌వ‌నిక మీద అస‌మాన‌మైన ప్ర‌తిభాపాటవాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న సంధ్యారాజు
న‌టిగా, క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్‌గా, జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్న కొరియోగ్రాఫ‌ర్‌గా, నిర్మాత‌గా… భార‌తీయ సాంస్కృతిక రంగంలో ఎంతో మందికి స్ఫూర్తి గా నిలుస్తున్నారు.ఎట్ హోమ్‌ రిసెప్ష‌న్ ని ఆగ‌స్టు 15 సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 15న ఉద‌యం జెండా వంద‌నం పూర్త‌వ‌గానే సాయంత్రం ఎట్ హోమ్‌ రిసెప్ష‌న్‌ని రాష్ట్ర‌ప‌తి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే
ఈ రిసెప్ష‌న్‌లో రాష్ట్ర‌ప‌తి మ‌న క‌ట్టుబొట్టును ప్ర‌తిబింబించే వ‌స్త్రాల‌లో క‌నిపిస్తారు. హాజ‌రైన అతిథుల‌తో ఆత్మీయంగా స‌మావేశ‌మ‌వుతారు. ఈ రిసెప్ష‌న్‌కి సీనియ‌ర్ రాజ‌కీయనాయ‌కులు, మిలిట‌రీ అధికారులు, ఇత‌ర‌త్రా రంగాల్లో క్రియాశీల‌క వ్య‌క్తులు హాజ‌ర‌వుతారు. అతిథులు ఫార్మ‌ల్‌, సెమీ ఫార్మ‌ల్ వేష‌ధార‌ణ‌లో హాజ‌ర‌వుతారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More