టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తరువాత దేశ రాజధాని లో జాతీయ కార్యాలయ ఏర్పాటు ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఇప్పుడు ఫోకస్ పెట్టారు… బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం కోసం జక్కంపూడి సమీపంలో మూడు స్థలాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో వాటిని పరిశీలించి అందులో ఒకదాన్ని ఎంపిక చేయనున్నట్టు తెలిసింది… బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానంతరం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేస్తోంది. ఇందుకోసం పనులు చురుగ్గా జరుగుతున్నాయి. విజయవాడ సమీపంలో అయితే అన్నింటికి అనుకూలంగా ఉంటుందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాణం పూర్తయిన వెంటనే.. అక్కడ నుండి కార్యాకలాపాలు మెుదలుకానున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో పని చేసేందుకు చాలామంది నేతలు ఆశక్తి చూపుతున్నారు. జక్కంపూడిలో 800 గజాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నట్టు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు ఆదినారాయణ పేరిట ఫ్లేక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ ప్రకటించిన రోజే.. ఏపీలోనూ కేసీఆర్ ఫ్లెక్సీలు వెలిసిన నేపధ్యం లో ఆంధ్ర లో కూడా కెసిఆర్ కు మంచి ఆదరణ వుందని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు. ఏ రాష్ట్రానికి ఇంత వరకు కార్యవర్గం ప్రకటించక పోయినా ఏ పి బీఆరేస్ పై మాత్రం ఎక్కడాలేని ఆశక్తి నేలకొంది కెసిఆర్ జాతీయ పార్టీ ప్రకటన వెలువడగానే వకాల్త పుచ్చుకుని మాట్లాడిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎపి బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. సుప్రీం కోర్ట్ లో రాష్ట్ర విభజనకు సంభందించిన కేసు విచారణకు వస్తున్న నేపధ్యంలో విభజన ను వ్యతిరేకిస్తూ కేసు వేసిన ఉండవల్లి విభజనకు అనుకూల బీఆరేస్ అధ్యక్షుడు కానున్నారా…? అన్న దానిపై పెద్ద చర్చే నడుస్తుంది. మెుదట ఏఏ రాష్ట్రాలపై కేసీఆర్ ఫోకస్ చేస్తారో తెలియాల్సి ఉన్నప్పతిక్ ఆంధ్ర రాష్ట్రంపై మాత్రం సీరియస్ గా ఆలోచిస్తున్నారన్నది ప్రస్తుతం నడుస్తున్న టాక్.
previous post
next post