Vaisaakhi – Pakka Infotainment

ఏపీ లో ఇరవై సీట్ల లెక్కేంటి…? బీజేపీ ఒంటరి పోరాటానికి సిద్ధమైందా..?

విశాఖలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజా వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుందా అనే సందేహం రాకమానదు. ఇదివరకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజెపి టిడిపి ,టిడిపి, జనసేన కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని పలు సందర్భాలలో స్పష్టం చేశారు. మొన్ననే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసి పొత్తులపై క్లారిటీ ఇచ్చారని ప్రచారం కూడా మొదలైంది. మరి ఇంతలో ఏపీలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తుంది అనే సందేహం ఎందుకు వచ్చిందేనేగా అందరి అనుమానం. విశాఖ సభలో అమిత్ షా మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం తొమ్మిది ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కోసం వివరిస్తూ అదే సమయంలో గత యూపీఏ ప్రభుత్వం కోసం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైసిపి అవినీతి పాలన పై విరుచుకుపడ్డారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ వచ్చే ఎన్నికలలో 300 సీట్లతో ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 20 ఎంపీ సీట్లు గెలిపించి బిజెపి విజయంలో భాగస్వామ్యం కావాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ఇప్పుడు ఈ విషయమే చర్చ సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపి, జనసేన, బిజెపి కలసి పోటీ చేయాలని అంతర్గతంగా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మెజార్టీ ఎంపీ సీట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపికి ఆ తర్వాత కొన్ని ఎక్కువ సీట్లు జనసేనకి మరికొన్ని బిజెపికి సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. అంటే రాష్ట్రంలో ఎంపీ సీట్లకు ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. ఇలా కలిసి పోటీ చేసినప్పుడు వచ్చిన 20 సీట్లు కోసం అమిత్ షా చెప్పారా లేదా బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే 20 సీట్లు గెలిపించి బిజెపికి అప్పగించాలని పిలుపునిచ్చారా అనేది ఇప్పుడు సందేహంగా ఉందని పలువులు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సభలో అమిత్ షా ఎక్కువగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో ఎన్నికలకు సంబంధించి ఎంపీ సీట్లు విషయమై ప్రస్తావించారు. అంటే ఆయన ప్రసంగం చాలా వర్క్ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన నోట్ ప్రకారమే జరిగిందనేది స్పష్టం అవుతుంది. టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు తమ ఉమ్మడి ఎజెండా వచ్చే ఎన్నికలలో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే, బిజెపి కూడా తమతో కలిసి రావాలని ఈ రెండు పార్టీలు బిజెపి కేంద్ర నాయకత్వాన్ని కోరాయి. అది ఇప్పటికే బీజేపీ వైసీపీల మధ్య అంతర్గతంగా అనుబంధం ఉందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వైపే ఉంది. పవన్ కళ్యాణ్ వెళ్లి కలిసి మాట్లాడిన, చంద్రబాబు వెళ్లి కలిసి మాట్లాడిన అటు కేంద్ర బిజెపి కానీ రాష్ట్ర బిజెపి నాయకత్వం కానీ పొత్తులపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన అయితే చేయలేదు. ఆంధ్రప్రదేశ్ లో అయితే బిజెపి ఒంటరిగా వెళ్లి పోటీ చేసి గెలిచే లేదనేది స్పష్టం. రాష్ట్రంలో బిజెపిపై కూడా వ్యతిరేకత ఉంది. ఒంటరిగా వెళ్తే ఆ పార్టీకి తీవ్ర నష్టం కొనసాగుతుంది. టిడిపి, జనసేన తో కలిసి వెళ్ళడమే ఆ పార్టీకి ఎంతో శ్రేయస్కరం. కొద్ది సీట్లు కూడా గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. వైసిపికి మేలు చేయాలని భావించి ఒంటరిగా వెళ్తే మాత్రం రాష్ట్రంలో 2019 ఎన్నికల కన్నా దారుణమైనరాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More