అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి చతికిల పడ్డ కమలనాథులు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలోని ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది స్థానాలు పూర్తిగా బీజేపీయే గెలుచుకుంటుందని ప్రచారం మొదలుపెట్టేశారు.. మోదీ అమిత్ షా ద్వయం లోని బీజేపీ వీర విధేయులు ఓటమి వెంటనే గెలిచేస్తామన్న మైండ్ గేమ్ ని మొదలెట్టేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్థానికాంశాలు ప్రభావితం చేసాయని అంటూనే ఈ ఫలితాల ప్రభావం తెలంగాణపై కూడా ఏమాత్రం ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఐదు రాష్ట్రాల సరిహద్దులు గల కర్ణాటక అసెంబ్లీ ఎన్నిక్షలలో ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ నేతలు ఒప్పుకోవడం లేదు. అది తమ తప్పిదం కాదని స్థానిక అంశాల ప్రభావంతోనే తాము తక్కువ సీట్లు తెచ్చుకున్నామని ఓట్ల శాతం తగ్గలేదని చెప్పేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించడం విశేషం.. కర్ణాటక ఫలితాలు బీజేపీకి అనుకూలంగా లేనప్పటికీ ప్రజల్లో మాత్రం వ్యతిరేకత లేదని చెప్పడానికి ఓట్ల శాతమే నిదర్శనమని చెప్తూ తమకు అనుకూల ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనప్పటికీ ఆ వెంటనే కొద్ది నెలల వ్యవధిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీయే గెలుపొందిందని, రాజస్థాన్‌లో క్లీన్ స్వీప్ చేసిందని గుర్తుచేస్తూ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం ఇతర రాష్ట్రాలపై ఉండదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, రాజ్యసభలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల విప్ జీవీఎల్ నరసింహా రావు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలోను స్పష్టం చేసారు. కర్ణాటక ఓటమితో దక్షిణ భారత దేశంలో బీజేపీ కోల్పోయిన ద్వారాన్ని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ద్వారా తెరుస్తామని ఢంఖా బాజాయిస్తున్నారు. ఏదేమైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం 2024 సార్వత్రిక ఎన్నికలపై ఉండదని, ప్రజలు దేశానికి మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అంటున్నారు.
previous post