న్యూ కాసిల్ మాక్స్ లైన్ స్ధాయి నౌక, ఎంవి హహైన్ నౌక విశాఖపట్నం పోర్టుకు చేరుకుంది. ఈ భారీ నౌకను జనరల్ కార్గో బెర్త్ లో బెర్తింగ్ చేశారు.
ఎమ్‌వీ హహైన్ గాబన్ నుంచి 1,99,900 మెట్రిక్ టన్నుల మాంగనీస్ ను రవాణా చేస్తోంది. భారతీయ పోర్టుకు సింగిల్ నౌక ద్వారా తీసుకువచ్చిన అతి పెద్ద సరుకు ఇదే కావడం విశేషం. ఇందులో 1,24,500 మెట్రిక్ టన్నులను విశాఖపట్నం పోర్టులో అన్ లోడింగ్ చేశారు. ఎమ్‌వీ హహాైన్ నౌక 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు మరియు 18.46 మీటర్ల డ్రాఫ్ట్ కలిగి ఉంది. ఈ సరుకును ప్రపంచంలోనే మాంగనీస్ ఎగుమతికి పేరు పొందిన ప్రముఖ మాంగనీస్ ఎగుమతిదారుడు ఎరామెట్ ఎస్.ఎ. ఫ్రాన్స్ రవాణా చేశారు. బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నౌక మరియు సరుకు నిర్వహణ ఏజెంట్లుగా సేవలు అందిస్తున్నాయి. ఈ షిప్మెంట్ విశాఖపట్నం పోర్టు మరియు బోత్రా షిప్పింగ్ సర్వీసెస్‌కి ఒక ముఖ్యమైన మైలురాయిగా విశాఖపట్నం పోర్టు చైర్ పర్సన్ డా ఎం అంగముత్తు, ఐఏఎస్ అభివర్ణించారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (విపిఎ) ఇటువంటి మైలు రాళ్లను చేరుకోవడానికి మరింత కృషి చేస్తోందని, భవిష్యత్తులో విశాఖపట్నం పోర్టు బల్క్ కార్గో ట్రాన్షిప్‌మెంట్‌కు కేంద్రంగా మార్చడానికి కృత నిశ్చయంతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు