సుందరమైన విశాఖ నగరం బీచ్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఇక్కడ వరుసగా ప్రమాదాల జరుగుతూ పలువురు మృత్యువాత పడుతున్నారు. యారాడ బీచ్ తో పాటు, భీమిలి, సాగర్ నగర్ అలాగే కోస్టల్ బ్యాటరీ నుంచి జోడుగుళ్ల పాలెం వరకు గల బీచ్ లలో పలువురు మృత్యువాత పడుతున్నారు. కొన్నిచోట్ల హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ ప్రజలు అవేమి పట్టించుకోకుండా మెడలోతు వరకు బీచ్ లో దిగి ఉవ్వెత్తిన ఎగిసిపడే కెరటాలకు సముద్రంలోకి కొట్టుకుని పోతున్నారు. ఆర్కే బీచ్ నుంచి పామ్ బీచ్ ప్రాంతం వరకు తీరంలోనే ఈ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా వారాంతపు సెలవులలోను, అలాగే పలు పండగల సమయంలోనూ ఎక్కువమంది కుటుంబాల తో కలిసి బీచ్ కు వస్తూ ఉంటారు. అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలోనే బీచ్ లో స్నానాలకు దిగి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇలా ప్రమాదాలకు గురైన వారిలో ఎక్కువమంది యువకులే ఉండటం విశేషం. ఇందులో చదువుకునే విద్యార్థులు కూడా ఎక్కువగా ఉంటున్నారు. ఇటీవల ఎక్కడ గోకుల్ పార్క్ బీచ్ ప్రాంతంలో ఒక హత్య జరిగింది. తనను ప్రేమించిన యువతీ మరొక యువకుడుతో చనువుగా ఉంటుందనే కోపంతో ఆ యువతని గోకుల్ పార్క్ బీచ్ కు తీసుకువెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఆ ఘటన తర్వాత బీచ్ తీరంలో పోలీసుల సహారా కూడా ఎక్కువైంది. కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ వరకు బీచ్ లో పోలీసులను పెట్టారు. ప్రమాదకర స్థితిలో కెరటాలు ఎగిసి పడే సమయంలో ఎవరు కూడా సముద్ర స్నానానికి వెళ్లకూడదని హెచ్చరించడమే ఈ పోలీసుల పని. పోలీసులు ఉన్న మామూలే. అక్కడికి వచ్చే జనం ఎవరి మాట వినడం లేదు. పోలీసులు గట్టిగా హెచ్చరించిన వారికి ఫోటోలు ,వీడియోలు తీసి కేసులు నమోదు చేస్తామని బెదిరించిన అస్సలు భయపడటం లేదు. కుటుంబంతో సరదాగా గడపడానికి ఇక్కడికి వస్తే షరతులు, నిబంధనలు అంటూ తమ్ముడు సముద్ర స్నానాలు చేయనివ్వరా అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. చేసేదేమీ లేక పోలీసులు కూడా తమ చెప్పాల్సింది చెప్పి తర్వాత ప్రేక్షక పాత్రను వహిస్తున్నారు. శుక్ర, శని, ఆదివారాలు ఈ మూడు రోజులు మాత్రం బీచ్ లో చాలా సందడిగా ఉంటుంది. ఆదివారం నాడు సాయంత్రం అయితే జనం రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళలో చాలామంది స్థానికేతరులే ఎక్కువగా ఉంటున్నారు. ఉపాధి కోసం అలాగే చదువుకునేందుకు వచ్చిన ఇతర ప్రాంతాల వాళ్లే వీకెండ్స్ టైం లో ఎక్కువగా వస్తున్నారు. వీరితోపాటు టూరిస్టులు కూడా ఎక్కువగానే ఉంటుంది. బీచ్ తీరంపై వీరికి సరైన అవగాహన లేకపోవడంతో ఎవరు చెప్పిన పట్టించుకోకుండా బీచ్ లోకి దిగి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ అధికారులు హెచ్చరిక బోర్డులతో సరిపెట్టకుండా పోలీసులు కూడా అక్కడే ఉంటూ ప్రజలను హెచ్చరిస్తూ జాగ్రత్త పడేలా చేయడం, ఎవరైనా మాట వినకపోతే వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని, అలా చేస్తేనే ప్రజలకు భయం అనేది ఉంటుందని పలువురు చెబుతున్నారు. గత పదేళ్ల నుంచి విశాఖ బీచ్ తీరంలో ప్రమాదాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఎనో ప్రమాదాలు జరిగి ,ఎంతో మంది మృతి చెందుతున్న ప్రజలు భయం పడటం అనేది కనిపించడం లేదు. అధికారుల మాటలను పెడ చెవిన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోరి తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.