శతాబ్దాల వివాదాలకు తెరపడి అయోధ్య శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముడి భవ్యాలయ నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.. అఖండ భారతావని అబ్బురపడేలా శ్రీరామచరిత విశ్వవ్యాపితం అయ్యేలా రూపుదిద్దుకుంటున్న అయోధ్య రామాలయంలో కొలువు తీరే శ్రీరామచంద్రమూర్తి సీతామాత విగ్రహాల తయారీకి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం నాటి భారీ శిలలు అయోధ్యకు తరలి రానున్నాయి 18టన్నుల శిల ఒకటి 16 టన్నులు బరువున్న మరో భారీ శిల ఒకటి.. ఈ రెండు భారీ సాలగ్రామ శిలలను నేపాల్ లోని కాళీ గంధకి నది (సాలగ్రామ నది)లో సేకరించారు. దామోదర్ కుండ్ లో పుట్టి బీహార్ లోని సోనేపూర్ వద్ద గంగా నదితో సంగమించే ఈ నదిని గతం లో సందర్శించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర సభ్యులు.. ఇతర మహంతులతో కలిసి అత్యంత పవిత్రత కలిగిన ఈ సాలగ్రామ శిలలను శ్రీరాముడు సీతాదేవి విగ్రహాల నిర్మాణం కోసం అనువైనవిగా నిర్ణయించారు. మ్యాగది మరియు ముస్తాన్గ్ ప్రాంతాలలోని నది లో ఈ భారీ శిలలను సేకరించారు. కార్బన్ డేటింగ్ పరీక్షలో ఇవి సుమారు 6 కోట్ల సంవత్సరాల క్రితం వని నిపుణులు చెప్తున్నారు. మైన్స్ మరియు జియాలజీ విభాగాల అనుమతులతో వీటిని నేపాల్ నుండి మన దేశానికి పిన్ రౌన్ బోర్డర్ మీదుగా బీహార్ లోని మదుబన్ ప్రాంతానికి చేరుకున్న ఈ భారీ శిలలకు వేలాదిమంది భక్తులు జైశ్రీరామ్ అంటూ జయజయ ద్వానాల మధ్య ఇండో నేపాల్ సరిహద్దుల్లో స్వాగతం పలికారు. ఈ భారీ శిలలను భౌగోళిక పురావస్తు నిపుణుల పర్యవేక్షణలో రోడ్డు మార్గానికి తరలించారు ఈ శిలలు సాంకేతికంగా శాస్త్రీయంగా విగ్రహాల తయారీకి అత్యంత అనుకూలమని నిపుణులు చెప్తున్నారు. కోట్లాది సంవత్సరాల చరిత్రను చూసి గంగమ్మ ఒడిలో సేదతీరిన పవిత్ర శిలలు అతి త్వరలో సీతారాములుగా పూజలు అందుకుని ప్రపంచవ్యాప్త హిందూ ధార్మికులకు ఆశీస్సులు అందజేయనున్నా